Skip to content

ఆన్లైన్ చదువులు భలే డిమాండ్

  • by

విద్యా సముపార్జనకు సాంకేతికత దన్నుగా నిలుస్తోంది. భయానక కరోనా పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం చూపినా ఆన్లైన్ విద్య అండగా మారుతోంది. పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న వారికీ చేదోడు వాదోడుగా నిలుస్తోంది. సుశిక్షితులైన ట్రైనర్లు ఆన్లైన్లో కోచింగ్ ఇస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు పడింది. అకాడమిక్ క్లాసులు వింటూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. భవిష్యత్ లో ఉద్యోగాలను దక్కించు కోవడానికి కావాల్సిన నైపుణ్యాలను అందిపుచ్చుకుంటు న్నారు. కరోనాతో నేరుగా శిక్షణ సంస్థలకు వెళ్లి చదువుకోలేకపోతున్న వారికి ఇప్పుడు ఆన్లైనే సరైన వేదికగా మారింది.

ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటూ మెప్పిస్తున్నారు ఆన్లైన్ మాస్టార్లు, ఫీజులు నామమాత్రంగానే ఉండటంతో చాలా మంది ఆన్లైన్ కోర్సుల బాట పడుతున్నారు. ఆమె పేరు ప్రతీక. సివిల్ కు సన్నద్ధమవుతోంది. కరోనా రక్కసి లేకపోతే ఈ సమయానికి ఢిల్లీలోని ఓ ప్రముఖ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటూ ఉండేది. అయితే ఆమె లక్ష్యానికి కొవిడ్ పరిస్థితులు అడ్డుగా మారాయి. దీంతో ఎలాగైనా గోల్ రీచ్ కావాలనే సంకల్పంతో ఆమె ఆన్లైన్ శిక్షణను ఎంచుకుంది. ఇంట్లోనే తరగతులు వింటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. అతడి పేరు రవీంద్ర. ఇంటర్ పూర్తి చేశాడు. డిజైనింగ్ కోర్సు చదవాలని ఆసక్తి, ఇందుకు తగ్గట్టు ప్రిపేర్ అయి ఎం ట్రైన్స్ ఎగ్జామ్ రాశాడు. గుజరాత్ లోని ఓ యూనివర్సిటీలో సీటు వచ్చింది. కానీ కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా అంతదూరం పంపించడానికి అతడి తల్లిదండ్రులు విముఖత చూపారు. దీంతో నగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి ఆన్లైన్లో డిజైనింగ్ కోర్సు చేస్తున్నాడు.

ఆన్లైన్ లో సాంకేతిక కోర్సుకు డిమాండ్

కొవిడ్ పరిస్థితులతో ప్రతిఒక్కరూ ఆన్లైన్ క్లాసులకు షిఫ్ట్ అయ్యారు. ఆన్లైన్ విద్యతో ఎంతో సమయం కలిసివస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ (ఆర్టిఫిషియ్ ఇంటలిజెన్స్) కోర్సును నేర్చుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అనేక విద్యా సంస్థలు ఏఐని అకాడమిక్ లో చేరుస్తున్నాయి. సాధారణంగా ఏఐ దూరం వచ్చేది. ఆ లైన్ ద్వారా నేర్చుకుంటే మాత్రం తక్కువగానే ఉన్నాయి.

టెక్నాలజీ కోర్సుల జోరు.

పోటీ పరీక్షలతో పాటు భవిష్యత్ అవసరాలను తీర్చే సాంకేతిక ప్రాజెక్టులకు కూడా ఆన్ లైన్ లో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ జ్ఞానం తప్పనిసరిగా చేశాయి. చాలా వరకు సాంకేతిక ఆధారంగానే కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. భౌతిక పాటించడం, టెంపరేచర్ చెకప్, మాస్క్ ధరించారా? లేదా? ఆటోమెటిక్ డోర్స్ ఓపెన్, శానిటైజింగ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగానే రూపొందించారు. మరోవైపు కోడింగ్ కోర్సుకు కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది. అలానే సైబర్ సెక్యూరిటీని ఔత్సాహికులు ఆన్లైన్ లోనే అభ్యసిస్తున్నారు. కీలకమైన టెక్నాలజీ కోర్సులు ఆన్లైన్లో రూ.5 వేల నుంచి అందుబాటులో ఉండటంతో ఔత్సాహికులు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంట్లోనే చదువులు.

ప్రస్తుతం ఆన్‌లైన్ స్టడీ ట్రెండ్ కొనసాగుతుంది. ఏ ఇంట్లో చూసినా ఆన్లైన్ చదువులే. జూమ్, స్కైప్, యూట్యూబ్ తదితర యాల్లో పాఠాలు వింటున్నారు. 2020 జీరో ఇయర్ నిరోధానికి ప్రత్యామ్నాయంగా ఆన్ లైన్ స్టడీ విధానాన్ని ఎంచుకుంటున్నారు. సమయం వృథా చేసుకోకుండా గ్రూప్స్, సివిల్స్, టెక్నాలజీ తదితర వాటికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం పోటీ పరీకలకు సనదమయ్యే సంఖ్య పెరుగుతుంది. కరోనాకు ముందు ధిలసుఖనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఇనిస్టిట్యూట్స్ విద్యార్థులతో కళకళలాడేవి. అయితే కొవిడ్ ప్రభావంతో సంస్థలన్నీ ఆన్ లైన్ బాట పట్టాయి. సుశిక్షితులైన సిబ్బందితో పాఠాలు చెప్పిస్తున్నాయి. సమయం వృథా కాకపోవడం.. ఫీజులు అందుబాటులో ఉండటంతో అభ్యర్థులు ఆన్ లైన్ విద్యకే జై కొడుతున్నారు.

స్కిల్స్ లేకపోవడంతోనే నిరుద్యోగం

ఆన్ లైన్లో కోడింగ్ పై శిక్షణ ఇచ్చే సంస్థలు అనేకం ఉన్నాయి. కొవిడ్ సమయంలో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న విద్యార్థులు, నిరుద్యోగులు కోడింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. శిక్షణా సంస్థల కోసం ఆన్లైన్లో శోధిస్తున్నారు. మందికి స్కిల్స్ లేకపోవడంతోనే నిరుద్యోగులుగా మారుతున్నారు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే భవిష్యత్ ఫలాలు అందుకోగలుగుతాం.

ఆన్లైన్ విద్యతో సమయం ఆదా

ఆన్లైన్లో సివిలకు ప్రిపేర్ అవుతున్నా. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చదువుకుంటున్నా. ప్రస్తుతం కరోనా పరిస్థితుల మూలంగా ఆన్లైన్ తరగతులే బెటర్. గతంలో ఒక క్లాస్ మిస్పైతే స్నేహితుల వద్ద నోట్స్ తీసుకొని రాసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆన్లైన్ క్లాసులను రికార్డు చేసుకునే వీలుంది. ఆన్లైన్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తక్కువగానే ఫీజులు తీసుకుంటున్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *