Skip to content

కస్టమర్ ల అభిరుచులను కనిపెట్టి వారిని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా ?

లాభాలు పెంచుకోవాలి, ఖర్చు లు తగ్గించుకోవాలి, పోటీలో ముందు ఉండాలి. కస్టమర్ల అభిరుచులను కవిపెట్డి వారిని కలకాలం కాపాడుకోవాలి..ఎలా ? వినియోగదారుల అవసరాల మేరకు వస్తువులు మార్కెట్లో ఏ విధంగా వస్తాయి ట్రెండ్స్ అందరూ ఫాలో అవుతారు.మరి ఆ ట్రెండ్స్ ఎవరు సృష్టిస్తారు? ఆధునిక డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో ఎదురయ్యే ఈ ప్రశ్నలకు ఏకైక సమాధానం ఎనలిటిక్స్. మనం నిన్న అన్వేషించిన వస్తువుకు సంబంధించిన సమాచారం ఈ రోజు ఏ వెబ్ సైట్ చూస్తున్నా, వాణిజ్య ప్రకటన రూపంలో దర్శనమిస్తుంది

బెంగళూరు వెళ్లడానికి అన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత పక్కనే బెంగళూరు హోటళ్ళు  ట్రావెల్ ఏజెన్సీల ప్రకటనలు వస్తుంటాయి. ఇవన్నీ ఎలాసాధ్యం? మన అవసరాలు, ఇష్టాలను అంత వేగంగా ఎవరు గమనిస్తున్నారు.. మనకు కావాల్సిన వాటినే ఎలా ప్రదర్శిస్తున్నారు ఒకటే సమాధాను. అదంతా ఎనలిటిక్స్ మహిమ

ఇదే  ఇప్పటి ఆధునిక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. కొత్త కొత్త అవకాశాలకు దారి చూపుతోంది. ఆ పెద్ద ఎత్తున  సమాచారాన్ని సేకరింది, విశ్లేషించి వ్యాపార, వాణిజ్యా వ్యూహాలకు దిశానిర్దేశం చేస్తోంది. ఫైనాన్షియల్ సర్వీస్, రిటైల్, హెల్త్ కేర్, ఎఫ్ ఎం సి జి . మీడియా తదితర విభాగాల్లో ఎనలిటిక్స ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్టాట్స్  క్వాన్ టిటేటివ్ – ఎనాలిసిస్  ఫాక్ట్ బెస్ట్  మేనజమేంట్  తదితరాలలో విశ్లేషించి, కొన్ని రకాల ఫలితాలను పొందమే  ప్రధాన లక్ష్యం. వీటి ఆధారంగా వినయోగదారుల బి హేవియర్, ప్యాటర్న్, ట్రెండ్  పపసిగాడతారు. వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. వ్యూహాలను రచిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *