Skip to content

“దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…” Song Lyrics | Deshamante Song Lyrics in telugu

“దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…” Song Lyrics

దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…
అడవి కాదోయ్.. గొడవ కాదోయ్..
అన్న చేతి గన్ను కాదోయ్..
క్షుద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్..
తీవ్ర వ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్…
దేశమంటే..

గడ్డి నుండీ గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్..
చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్..
రాజధానుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్..
అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్..
పరిథి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్..
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్..
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్..

దేశమంటే…..
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..

ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
హిసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
క్రోథమెందుకు కరుణపంచు స్వార్థమెందుకు సహకరించు..
పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు..
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..
మల్లెపువ్వుల లాంటి బాలల తెల్లకాగితమంటి బ్రతుకులు రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు..
కొత్త బంగరు భవిత నేడే కానుకందించు..
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు..

దేశమంటే..
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే మనుషులోయ్..
దేశమంటే..
దేశమంటే మనుషులోయ్..

“దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్…” Song Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *