Skip to content

మన రూపాయికి రూపం ఇచ్చిన వ్యక్తీ

యూఎస్ డాలర్’, బ్రిటీష్ పౌండ్’, జపనీస్ ‘యెన్’ మరి మన దేశానికి రూపాయి, అలాంటి రుపాయి సింబల్ కథ, దానిని రూపొందించడం వెనుక ఓ వ్యక్తి తాపత్రయం తెలుసుకునే ప్రయ త్నం చేద్దాం.మన దేశ రూపాయికి ప్రస్తుతమున్న డిజైన్ ను రూపొం దించింది. మన ఐఐటీ విద్యార్థి ఉదయ్ కుమార్.

దేవనాగరి లిపి నుండి ‘ర’ను, రోమన్ గుర్తు ‘ఆర్’ ను కలగలిపి ఈ కొత్త డిజైన్ సృష్టించాడు. ముందు రూ గా మన దేశ రూపాయి ప్రాచుర్యంలో ఉండేది. ఈ గుర్తును డిజైన్ చేయడానికి మొత్తం 3 వేల మంది పోటీపడగా, అందులో 5 గురిని సెలెక్ట్ చేశారు. చివరగా ఐఐటీ బాంబే విద్యార్థి ఉదయ్ కుమార్ రూపొందించిన ఈ డిజైన్ బాగుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది.

మన దేశ రూపాయి గుర్తును అద్భుతంగా డిజైన్ చేసిన ఉదయ్ కుమార్ ప్రసుతం అసిస్టెంట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఉదయ్ కుమార్ డిజైన్ చేసిన ఇండియన్ రుపీ సింబల్ ను ఒక్క మనదేశంతో పాటు ప్రపంచమంతా కొనియాడింది. రూపాయికి గుర్తింపు తెచ్చేలా ఈ డిజైన్ ఉందని అంతా ఉదయ్ కుమార్ ను కొనియాడారు. అయితే దేశం గర్వించ దగ్గ స్థాయిలో ఈ పనిచేసిన ఉదయ్ కుమార్‌కు, ప్రభుత్వం నుండి గొప్ప పేరు, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చి నా అతడు మాత్రం తనకెంతో ఇష్టమైన విద్యాబోధనకే మొగ్గుచూపాడు. ప్రస్తుతం ఐఐటీ గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన సేవలందిస్తున్నాడు. ఉదయ్ కుమార్.

తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచి గ్రామంలో జన్మించిన ఉదయ్ కుమార్, చెన్నైలో తన విద్యాభ్యాసం చేశా డు. ఉదయ్ కుమార్ తండ్రి ఎన్. ధర్మలింగం రాజకీయాలలో డీఎంకే పార్టీ నుండి ఎమ్మేల్యేగా తన సేవలం దించేవాడు. 2001లో అన్న యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో పట్టా పొంది,ఆ తర్వాత విజువల్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, బాంబే ఇండస్ట్రియల్ డిజైన్ లో పి.హెచ్.డీ చేశాడు. ఇలా ఉన్నతవిద్యను అభ్యసించిన ఉదయ్ ప్రస్తుతం ఐఐటీ గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుండటం విశేషం. గొప్ప పని చేసి ఆ గొప్పదనం అందరికీ తెలియాల్సిన అవసరం లేదనుకుంటారు కొందరు. ఆ క్యాటగిరీకి చెందినవాడే ఉదయ్ కుమార్. మనం దేశం ఎప్పటికీ గుర్తుంచుకునే పనిచేసిన ఉదయ్ కుమార్, ప్రస్తుతం ప్రొఫెసర్ గా సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉండటం అభినందించదగ్గ విషయం. మనదేశ రూపాయి గుర్తుకు వన్నె తెచ్చిన ఉదయ్ కుమార్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *