1856లో తొలిసారి సర్వే ఆఫ్ ఇండియా ఎవరెస్ట్ శిఖరాన్ని కొలిచింది. సర్ జార్జ్ ఎవరెస్ట్ నేతృత్వంలో ఆ సర్వే సాగింది. ఎవరెస్ట్ ఎత్తు 29వేల ఫీట్లు ఉన్నట్లు నిర్ధారించారు. రౌండ్ ఫిగర్ కాకుండా మరో రెండు ఫీట్లు పెంచి.. దాన్ని 29,002 ఫీట్లుగా మార్చారు. ఇది మీటర్లలో కొలిస్తే.. 8,839.2 మీటర్లు అవుతుంది. 1980-83, 1903 సంవత్సరాల్లో కూడా సర్వే ఆఫ్ ఇండియా మళ్లీ ఎవరెస్ట్ ఎత్తును కొలిచింది. ఆ లెక్కల్లో ఎవరెస్ట్ ఎత్తు 8882 మీటర్లు లేదా 29,141 ఫీట్లుగా నిర్ధారించారు. 1955లో మళ్లీ సర్వే ఆఫ్ ఇండియా ఎవరెస్ట్ ఎత్తును లెక్కించింది. అప్పుడు ఆ పర్వతం ఎత్తు 8848 మీటర్లు లేదా 29028 ఫీట్లుగా గుర్తించారు అయితే 1975లో చైనా ఆ ఎత్తును కన్ఫర్మ్ చేసింది. 1987లో ఇటలీ కూడా ఎవరెస్టు కొలిచింది.
ఎవరెస్ట్ ఎత్తు 8872 మీటర్లు ఉన్నట్లు ఆ దేశం తేల్చింది. మళ్లీ 1992లోనే – ఇటలీ ఎవరెస్ట్ ఎత్తును లెక్కించింది. అప్పుడు రాక్ హయిటు 8846 మీటర్లుగా నిర్ధారించారు. 1999లో అమెరికా కూడా ఎవరెస్ట్ ఎత్తును కొలిచింది. ఎవరెస్ట్ 8850 మీటర్లు లేదా 29035 ఫీట్ల ఎత్తు ఉన్నట్లు ఆ దేశం తేల్చింది. 2005లో చైనా కూడా ఎవరెస్ట్ ఎత్తును కోలిచింది. వారి లెక్కల ప్రకారం ఎవరెస్ట్ ఎత్తు 8844.43 మీటర్లు లేదా 29017 ఫీట్లుగా ఉంది. ఈ ఏడాది నేపాల్, చైనా దేశాలు సంయుక్తంగా ఎవరెస్ట్ పర్వతం ఎత్తును ప్రకటించాయి. వారి లెక్కల ప్రకారం ఎవరెస్ట్ ఎత్తు 86 సెంటీమీటర్లు పెరిగింది. ఇప్పుడు ఎవరెస్ట్ ఎత్తు 8848.86 మీటర్లు. భీమ్ లాల్ గౌతమ్ అనే నేపాలీ సర్వేయర్‌తో పాటు న్యూజిలాండ్ సర్వేయర్లు ఈసారి ఎవరెస్ట్ ఎత్తును కొలిచారు.
2019, మే 22వ తేదీన గౌతమ్ బృందం ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుకున్నది. జీఎస్ఎస్ఎస్ ఈక్విప్మెంట్ ద్వారా పర్వతం ఎత్తును కొలిచారు. పర్వతారోహకుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ట్రైపాడ్ ఎత్తును లెక్కించారు. న్యూజిలాండ్ లోని ఒటాగో వర్సిటీకి చెందిన క్రిస్టోఫర్ పియర్నతో కలిసి నేపాలీ సర్వేయర్లు పనిచేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ లోని కే: పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన రెండవ పర్వతం. దాని ఎత్తు 8611 మీటర్లు. అయితే ఎవరెస్ట్ ఎత్తు పెరగడంతో ఆ పర్వతానికి ఎటువంటి ప్రమాదం లేదని సర్వేయర్లు చెబుతున్నారు.