Health – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Thu, 14 Oct 2021 12:03:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 ఉల్లి రసంతో బొజ్జ మాయం http://www.goodinfochannels.com/%e0%b0%89%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%ac%e0%b1%8a%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c-%e0%b0%ae%e0%b0%be%e0%b0%af%e0%b0%82/ http://www.goodinfochannels.com/%e0%b0%89%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%ac%e0%b1%8a%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c-%e0%b0%ae%e0%b0%be%e0%b0%af%e0%b0%82/#respond Thu, 14 Oct 2021 12:03:57 +0000 https://teluguinfo.net/?p=367 Read More »ఉల్లి రసంతో బొజ్జ మాయం]]> బొజ్జ బాగా పెరిగిందని బెంగపెట్టుకున్నారా? అయితే ఈ చిట్కాను తప్పకుండా పాటించండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉల్లి సకల రోగాల నివారిణి. దాన్ని పచ్చిగా తినినా కూరలో వేసుకున్నా అందులోని పోషకాలు ఎప్పుడూ శరీరానికి మేలే చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో కొవు నిల్వలు పెరగకుండా సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే ‘క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ శరీరంలో పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. మెటబాలిజంను పెంపొందించి కొవ్వు  పేరుకుపోవడం తగ్గిస్తుంది. 

ఉల్లిపాయలో కేలరీలు, సోడియం, కొలెస్ట్రాల్ తక్కువ కాబట్టి.. బరువు పెరుగుతామనే బెంగ కూడా అవసరం లేదు. ఉల్లితో బరువు తగ్గాలంటే ఈ కింది చిట్కాను పాటించండి. ఉల్లిపాయను రసంగా చేసుకుని తేనెతో కలపి పరగడుపునే తాగండి. రోజు విడిచి రోజు ఇలా తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రసం పొట్ట భాగంతోపాటు ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది.

ఇలా తయారు చేయండి :

ఉల్లిపాయ రసం, తెనే మిశ్రమం తయారీ కోసం పెద్ద పరిమాణంలో ఉన్న ఒక ఉల్లిపాయ తగిన మోతాదులో నీరు తీసుకోండి.

ఉల్లి రసంలో కలిపేం దుకు 1-2టీ స్పూన్ల తేనె అసవరం. ముందుగా ఉల్లిపాయ పొట్టు తీసి ముక్కులు చేయండి. అనంతరం ఆ ముక్కలను మిక్సిలో వేసి రుబ్బండి.

దానికి తగిన మోతాదులో నీరు, తేనె కలపండి. అంతే.. రసం సిద్ధమైపో తుంది. ఉల్లి గుజ్జుతో తాగడం ఇబ్బంది అనిపిస్తే.. ఒక శుభ్రమైన క్లాత్లోకి కలపడానికి ముందే ఉల్లి రసాన్ని వడపోయండి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%89%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%ac%e0%b1%8a%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c-%e0%b0%ae%e0%b0%be%e0%b0%af%e0%b0%82/feed/ 0 367
రోజుకు 3 సార్లు బ్రష్ చేస్తే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందట http://www.goodinfochannels.com/%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81%e0%b0%95%e0%b1%81-3-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b7%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d/ http://www.goodinfochannels.com/%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81%e0%b0%95%e0%b1%81-3-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b7%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d/#respond Fri, 24 Sep 2021 12:36:11 +0000 https://teluguinfo.net/?p=363 Read More »రోజుకు 3 సార్లు బ్రష్ చేస్తే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందట]]> నోరు, దంతాలు పరిశుభ్రంగా ఉండకపోతే రక్తంలో బాక్టీరియా పెరిగి తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో సైంటిస్టులు తమ పరిశోధనల్లో వెల్లడించిన విషయం విదితమే. అందుకనే వైద్యులు నోరు, దంతాలను సురక్షితంగా ఉంచుకుంటే గుండె జబ్బులు రావని చెబుతుంటారు. అయితే నిత్యం 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు దంతధావనం చేస్తే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా… అధ్యయనాల్లో వెల్లడైంది. దక్షిణ కొరియాలోని కొరియన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్కు చెందిన 40 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1,61, 286 మందిపై అక్కడి సైంటిస్టులు 10.5 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు.

‘ఆ సమయంలో వారి ఎత్తు, బరువు, వారికున్న అనారోగ్య సమస్యలు, జీవన విధానం, దంతాలు, నోటి ఆరోగ్యం తదితర వివరాలను సేకరించారు. ఈ క్రమంలో అన్ని వివరాలను విశ్లేషించి చివరకు సైంటిస్టులు తేల్చింది ఏమిటంటే నిత్యం 3 అంతకన్నా ఎక్కువ సార్లు బ్రష్ చేసుకునేవారి హార్ట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు 12 శాత వరకు తగ్గుతాయని, అలాగే ఆట్రియల్ ఫైబ్రి లేషన్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశం 10 శతం వరకు తక్కువగా ఉంటాయని చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరు తమ దంతాలు నోటి పరిశుబ్రత పై దృష్టి పెట్టాలని సదరు సైంటిస్టులు సుచిస్తున్నారు

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81%e0%b0%95%e0%b1%81-3-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b7%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d/feed/ 0 363
ఊపిరితిత్తులు బలంగా అవ్వాలా? ఇలా చేయండి|Best Lunges Exercise http://www.goodinfochannels.com/%e0%b0%8a%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ac%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%85%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/ http://www.goodinfochannels.com/%e0%b0%8a%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ac%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%85%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/#respond Sun, 30 May 2021 18:11:22 +0000 https://teluguinfo.net/?p=306 కరోనా వైరస్ సోకితే ముందుగా ప్రభావితమయ్యేవి ఊపిరితిత్తులే ! కొవిడ్ 19 నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్యలు చాలా రోజుల వరకు వెంటాడుతూనే ఉన్నాయి. అంటే వైరస్ పూర్తిగా తగ్గిపోయినా.. దాని ప్రభావం వల్ల ఊపిరితిత్తులు యథాస్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. అందుకే కరోనా బారిన పడి దెబ్బతిన్న ఊపిరితిత్తులు తిరిగి యథాస్థితికి చేరుకునేందుకు ఫిజియోథెరపిస్టులు కొన్ని వ్యాయామాలను సూచిస్తున్నారు. ప్రతి రోజు ఈ ఎక్సర్సైజ్లను 6 నుంచి 7 సార్లు చేయాలని చెబుతున్నారు. మరి అవేంటో ఒకసారి చూద్దామా..

ఊపిరితిత్తులు బలంగా అవ్వాలా? ఇలా చేయండి


స్పైరో మీటర్

spirometer

ఒక మెషిన్ లో మూడు బాల్స్ ఉండే ఈ స్పైరో మీటర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఊపిరితిత్తులను బలంగా చేసేందుకు ఈ వ్యాయామం చక్కగా పనిచేస్తుంది. ఈ స్పైరో మీటర్కు ఉండే చిన్న పైపును నోట్లో పెట్టుకుని.. బలంగా శ్వాస తీసుకోవాలి. మెషిన్లో ఉన్న బాల్స్ పైకి వచ్చేలా గాలిని బలంగా పీల్చుకోవాలి. ఆ తర్వాత ముక్కు నుంచి గాలిని నెమ్మదిగా బయటకు వదలాలి. ఈ సమయంలో మెషిన్లోని బాల్స్ జెర్క్ ఇచ్చినట్టుగా ఒక్కసారిగా కిందపడకూడదు. ఒకేరకంగా బాల్స్ పైకి లేచి.. మళ్లీ కిందకు రావాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.


ముక్కుతో శ్వాస తీసుకుని నోటితో వదలాలి

ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచుకోవడంలో ఇది మరో చక్క వ్యాయామం. ఇందులో భాగంగా ముందు నోటిని మూసుకుని ముక్కు ద్వారా బలంగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత పీల్చిన గాలిని నెమ్మదిగా నోటి ద్వారా వదలాలి. ఇలా ఒక రోజులో కనీసం 6 నుంచి 7 సార్లు చేయాలి.


ఓంకారం

యోగ ముద్రలో కూర్చొని ఓంకారం ఉచ్ఛరిస్తూ శ్వాస మీద ధ్యాస పెంచే ఈ వ్యాయామం గురించి చాలామందికి తెలుసు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచుకోవడంలో ఇది పురాతనం నుంచి వస్తున్న ఓ చక్కటి పద్ధతి. పొట్ట నుంచి ఓం శబ్దం ఉచ్చరిస్తూ గట్టిగా శ్వాస తీసుకుని వదలడం ద్వారా ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి. అయితే ఓంకారం శబ్దం చేసేటప్పుడు దీర్ఘం తీసినట్టుగా అంటూ శ్వాస తీసుకుని వదిలితే మంచి ఫలితం ఉంటుంది.


మరో వ్యాయమం

శ్వాసకు తగ్గట్టుగా ఊపిరితిత్తులను ముందుకు వెనక్కి కదిలించడం ద్వారా కూడా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం రెండు పద్ధతులు ఉన్నాయి. రెండు చేతులను ముందుకు పెట్టాలి. బలంగా శ్వాస తీసుకుంటూ చేతులను వెనక్కి తీసుకెళ్లాలి. శ్వాసకు తగ్గట్టుగా చేతులు వెనక్కి వెళ్లాలి. అలాగే శ్వాస వదులుతూ మళ్లీ చేతులను ముందు వైపుకు తీసుకురావాలి. ముందుగా రెండు చేతులను తల వెనుక భాగంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు మోచేతులను తల ముందు భాగం వైపు దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు బలంగా శ్వాస తీసుకుంటూ.. రెండు మోచేతులను దూరంగా తీసుకెళ్లాలి. శ్వాస తీసుకునే క్రమానికి తగ్గట్టుగా మోచేతులను దూరంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా శ్వాసను వదులుతూ రెండు మోచేతులను దగ్గరగా తీసుకురావాలి.

బెలూన్ ఊదడం

ఊపిరితిత్తులు తొందరగా కోలుకోవడానికి ఎక్కువగా సూచించే పద్ధతి ఇది. అలా అని దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బెలూన్లలో గాలి నింపడానికి బలంగా ఊదాల్సి ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.


వాకింగ్

ఊపిరితిత్తుల స్థితిని బట్టి వాకింగ్ చేయడం దినచర్యలో భాగం చేసుకోవాలి. ప్రస్తుతం పరిస్థితుల్లో పార్కులు,
బయటకు వెళ్లే బదులు ఇంటి వరణలోనే వాకింగ్ చేయడం ఉత్తమం.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%8a%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ac%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%85%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5/feed/ 0 306
కుంకుమ పువ్వు ఉపయోగాలు http://www.goodinfochannels.com/%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%ae-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b1%81-%e0%b0%89%e0%b0%aa%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/ http://www.goodinfochannels.com/%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%ae-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b1%81-%e0%b0%89%e0%b0%aa%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#respond Sun, 09 May 2021 15:19:07 +0000 https://teluguinfo.net/?p=260 గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతారు అని అంటుంటారు. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా రంగు, రుచి వాసనా ఉన్న అరుదైన సుగంధ ద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ ‘ప్రియమైన ఎర్ర బంగారం!

కుంకుమపువ్వు.. ఈ పేరు వినగానే కాశ్మీర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా.

అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్ ఇరాక్, ఇటలీ, సిసిలీ, టర్కీ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకి కాశ్మీర్ కేసర్ నాణ్యమైనది. కుంకుమపువ్ల్వనే
ఇంగ్లీష్ లో ‘ శాఫ్రాన్ అంటారు. ‘ జాఫ్రాన్ అనే అరబిక్ పదం నుంచి ఇది ఆవిర్భవించింది. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాలంతటా దీనిని ‘కేసర్ అంటారు.

పువ్వంటే పువ్వు కాదు కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్రలిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు వస్తాయి. కాశ్మీర్ లో పండించే కుంకుమపుష్వ మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు.

కేవలం వంగపండు రంగు పువ్వు మాత్రం కనిపిస్తుంది. కాశ్మీర్ లోని పాంపోర్ ప్రాంతంలోని నేలంతా అక్టోబరు-నవంబరులో విరబూసిన కుంకుమపువ్వుతో నిండిపోతుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది.

అదే కుంకుమపువ్వు అనుకుంటే పొరపాటే. అందులో ముచ్చటగా మూడే అండకోశాలు, రెండు కేసాలు, రెండు కేసరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు.

ఈ ఎరుపు రంగు భాగమే ఘాటైన వాసననీ, రుచినీ, రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశ భాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చు కున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడి పోతాయి.
అండకోశాలు రంగునీ, రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నిటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు. కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. అన్నింటినుంచీ అండకోశాలను చేత్తోనే వేరుచేయాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. శాఫ్రాన్ అంత ధర పలకడానికి ఇదీ ఓ కారణమే. మన దగ్గర గ్రాము కుంకుమపుష్వ ధర సుమారు రూ.60 నుంచి 600వరకూ ఉంటుంది.

నాణ్యతను బట్టి ధర మారుతుంది. మనిషి వాడిన మొదటి సుగంధ ద్రవ్యం ఇదేనట. సుగంధ ద్రవ్యాల్లోకెల్లా ఖరీదైనది కూడా ఇదే. ప్రాచీన రోమన్లు స్నానానికి, జుట్టుకి రంగు వేసుకునేందుకు కూడా దీన్ని ఎక్కువగా వాడేవారు. దీన్ని అంతటా వంటల్లోనే ఎక్కువగా వాడుతున్నారు.

బిర్యానీ, పాయసం, హల్వా, హల్వా, కాశ్మీరీ పలావ్- ఇలాంటివి చేయాలన్నా చిటికెడు కుంకుమపుష్వ వేస్తే ఆ రుచే వేరు. పర్షియన్, స్పెయిన్ వంటల్లో ఇది తప్పనిసరి. స్తోమత ఉండి వేయాలేగానీ, ఏ వంటలో
వేసినా దానికి ఒకలాంటి ఘాటుతో కూడిన మంచి వాసన, రంగూ, రుచీ వస్తాయి. ఈ వాసన కారణంగానే దీన్ని పరిమళ ద్రవ్యాల్లోనూ వాడుతుంటారు. అయితే ఆహార పదార్థాల్లో వాడేటప్పుడు తగు మోతాదులోనే వాడాలి. మరీ ఎక్కువ వాడితే మొదటికే మోసం. రుచి మారి చేదెక్కుతుంది.

మేను సింగారంల కుంకుమపువ్వు మంచి సౌందర్య సాధనం కూడా. అందుకే కాస్మెటిక్ క్రీముల్లోనూ దీన్ని విరివిగా వాడుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియాలో గుణాల వల్ల ఇది మొటిమలకు కూడా మందులా పనిచేస్తుంది.

పుత్తడితో తులతూగే కుంకుమపువ్వులో నిజంగానే బంగారంలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కుంకుమపువ్వులో శాఫ్రనాల్, ఇతర గాఢతైలాలు ఉండటం వల్లే, కుంకుమపువ్వుకి ఆ వాసన వస్తుంది.

ఇఫా-క్రోసిన్, జియాక్సాంథిన్, లైకోసిన్, బీటాకెరోటిన్ శా వంటి కెరోటినాయిడ్ల వల్లే వీటికా రంగు వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల గుణాలున్న ఈ ఫైటోకెమికల్స్ అన్నీ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.

మూత్రపిండాలు, మూత్రాశయం, కాలేయ రుగ్మతలను తగ్గిస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. నెలసరిని క్రమబద్ధం చేస్తుంది. కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తుంది. కడుపులో నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఇది జీర్ణశక్తికి చాలా మంచిది. పేగు గోడలకు పూతలా అతుక్కుని ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ డిఫ్రసెంట్ గానూ పనిచేస్తుంది.
పడుకునే ముందు చిటికెడు కుంకుమపువ్వుని పాలల్లో కలుపుకుని తాగి పడుకుంటే నిద్రలేమి తగ్గుతుంది. ఫలితంగా డిప్రెషన్ వంటివి కూడా
తగ్గుతాయి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%ae-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b1%81-%e0%b0%89%e0%b0%aa%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/feed/ 0 4748
ఆరోగ్యం కోసం బెల్లం మధురౌషధం http://www.goodinfochannels.com/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81%e0%b0%b0/ http://www.goodinfochannels.com/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81%e0%b0%b0/#respond Fri, 07 May 2021 08:46:39 +0000 https://teluguinfo.net/?p=244

ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధాలుగా మలచుకోవడం ఆయుర్వేద శాస్త్ర విశిష్టత. ఆరు రుచులలోనూ (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) మధుర రసానిదే అగ్రస్థానం. కొన్ని పదార్థాలు నాలుకకు తగలగానే తీపి స్ఫురిస్తుంది. కొన్నింటిలో తీపి అంతర్లీనంగా అనురసంగా ఉంటుంది. వివిధ ఫలాలు, దుంప జాతులు, కొబ్బరి నీళ్ల వంటి ద్రవ్యాలలోని మాధుర్యం అందరికీ తెలిసినదే. బయటకు గట్టిగా కర్రలా ఉన్నా, చెరకులో నిండుగా తీపి ఉంటుంది. చెరకును సంస్కృతంలో ఇక్షు అంటారు.

మన దేశంలో చాలాకాలంగా ఇక్షు రసం నుంచి బెల్లం (గుడం) తయారుచేస్తున్నారు. ఔషధాల తయారీలో, వంటకాలలో బెల్లాన్ని ఉపయోగిస్తారు. సితా (పటిక బెల్లం), ఖండ శర్కర (ఇసుకలా అతి సన్నగా ఉన్న పంచదార), మధు శర్కర (తేనె నుంచి తయారైన పంచదార)… ద్రవ్యాల ప్రయోజనాల గురించి భావప్రకాశ సంహితలో కనిపిస్తుంది. కాని వీటి తయారీ గురించి కనపడదు. ఈనాడు రసాయనిక పదార్థాలతో తయారుచేస్తున్న పంచదారకు, నాటి సహజ సిద్ధమైన శర్కరలకు చాలా తేడా ఉంది. బెల్లం అమోఘమైన పోషకాహారం.

చెరకు బెల్లం – సశాస్త్రీయ వివరాలు

చెరకు రసం: శరీరానికి చలవ చేస్తుంది. వీర్యవర్థకం, కఫకరం. కాచిన చెరకు రసం శరీరం లో వేడిని ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని వాయువుని, కడుపు నొప్పిని పోగొడుతుంది. నిల్వ చేయటం వలన పులిసిన చెరకు రసం మంచిది కాదు (కొన్ని గంటలపాటు పులిస్తే పరవాలేదు). మలమూత్రాలను సాఫీగా జారీ చేస్తుంది. గుణాలు: తియ్యగా, జిగురు (స్నిగ్ధం) గా ఉంటుంది. వాతహరం. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది, కాని శర్కరంత చలవ చేయదు. మూత్రాన్ని సాఫీగా చేసి మూత్ర వికారాలను తగ్గిస్తుంది. వృష్యం (శుక్రకరం, వీర్యవర్థకం), బలవర్థకం. దేహంలో కొవ్వును (మేదస్సు) పెంచుతుంది. కఫాన్ని, క్రిములను పెంచుతుంది. (ఇక్షా రసో యస్సపక్వో జాయతే… సగుడా… వృష్యా గురు: స్నిగ్ధ వాతఘ్నో మూత్ర శోధనః’ నాతి పిత్త హరో మేదః కఫ కృమి బలప్రదః)

కొత్త బెల్లం: జఠరాగ్నిని పెంచుతుంది, కాని కఫాన్ని, కృములను కలుగచేస్తుంది. దగ్గు, ఆయాసాల ను పెంచుతుంది. (గుడో నవః కఫ శ్వాస కాస కృమి కరో అగ్నికృత్)

పాత బెల్లం: చాలా మంచిది (పథ్యం), లఘువు అంటే తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి, పుష్టిని కలిగిస్తుంది. వృష్యం. రక్తదోషాన్ని పోగొడుతుంది. వాతరోగాల్ని తగ్గిస్తుంది. గుడో జీర్ణ లఘుః పథ్యో న అభిష్యంది అగ్ని పుష్టికృత్ పిత్తఘ్నో మధురో వృష్యా వాతఘ్నో అస్పక్ ప్రసాదనః

ఔషధ గుణాలు: బెల్లాన్ని శుంఠి (శొంఠి)తో కలిపి సేవిస్తే, అన్నిరకాల వాతరోగాలు తగ్గుతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు పోతాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే, అన్ని పిత్త రోగాలు ఉపశమిస్తాయి. ఇది మూలవ్యాధి (పైల్స్)ని తగ్గించడానికి మంచి మందు.

మత్స్యండీ: చెరకు రసాన్ని ఒక పద్ధతిలో వేడి చేస్తూ బెల్లాన్ని తయారుచేసేటప్పుడు, చివరన కొంచెం ద్రవాంశలు మిగిలిపోతాయి. దానినే మత్స్యండీ అంటారు. ఇది బలకరం, మృదురేచకం, రక్తశోధకు, వీర్యవర్ధకం. (మత్స్యండీ భేదినీ, బల్యా, బృంహణీ వృష్యా, రక్తదోషాపహాః స్మృతా)

ఆధునిక జీవరసాయన పోషక వివరాలు:

తాటి బెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరకు ల్లాన్నే ఎక్కువ వాడుతున్నారు. దీనిలోని పోషకల విలువలు కూడా విశిష్టం. నూరు గ్రాముల బెల్లంలో ప్రొటీన్లు 0, 4, కొవ్వులు 0, 1, మినరల్స్ 0.6 శర్కరలు (కార్బోహైడ్రేట్స్) 95 శాతం, కాల్షియం 80 శాతం, ఫాస్ఫరస్ 40 శాతం, ఐరన్ 2.64, కేలరీలు 383 ఉంటాయి.

తయారీలో- ఆసక్తికర అంశాలు:

రిఫైన్డ్, డిస్టిలేషన్ చేయకుండా ఉన్నది. మంచి బెల్లం. దీంట్లో కెమికల్స్ వాడకపోవటం వలన అన్ని పోషక ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్) భద్రంగా ఉంటాయి. మట్టిరంగు వంటి నలుపు రంగులో ఉండే బెల్లం ఉత్తమం. దీంట్లో విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యకరం. ఆర్గానిక్ బెల్లం (జాగరీ): ఇది మరింత శ్రేష్ఠం. చెరకును పండించినపుడు కృత్రిమ రసాయనిక ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని వాడరు. బెల్లంలో తెలుపు లేదా ఎరుపు రంగు రావటం కోసం కెమికల్స్ (బేకింగ్ సోడా, కాల్షియం కార్బొనేట్/సున్నం పొడి, జింక్ ఫార్మాల్ డిహైడ్ సల్ఫాక్సిలేటు వంటివి) వాడరు. కనుక పసుపు మిశ్రిత మట్టిరంగులో చూర్ణం రూపంలో ఉంటుంది. సుక్రోజ్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు వార్ధక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి.

కల్తీ బెల్లాలు: నిగనిగలాడే ఎరుపు, తెలుపు, పసుపు రంగులు విరజిమ్మటం కోసం హానికర కెమికల్స్, తీపిని అధికం చేసే కెమికల్స్, నిల్వ ఉండటానికి కెమికల్స్ అధిక మోతాదులో కలుపుతారు. అసలైన మట్టిరంగు కంటె ఈ ఆకర్షిత రంగు బెల్లానికి వినియోగదారులు ఆకర్షితులవుతారు. పంచదార తయారీలో మితిమీరిన తెలుపు, తీపి మినహా పోషక విలువలు ఉండవు. బ్రౌన్ సుగర్ లో బ్లీచింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు నయం. తెల్లటి పంచదార తయారీ లో రసాయనిక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆ పంచదార ఆరోగ్యానికి చేటు చేస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81%e0%b0%b0/feed/ 0 4743
ఉప్పు అతిగా తినడం ముప్పు… http://www.goodinfochannels.com/%e0%b0%89%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a4%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a1%e0%b0%82-%e0%b0%ae%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81/ http://www.goodinfochannels.com/%e0%b0%89%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a4%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a1%e0%b0%82-%e0%b0%ae%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81/#respond Fri, 07 May 2021 08:43:49 +0000 https://teluguinfo.net/?p=248 ఉప్పుని శరీరానికి హితశత్రువు అనుకోవచ్చు. వంటకానికి రుచి తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేసుకుంటుంది ఉప్పు. ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటారు. మానవ శరీరం అసంఖ్యాక కణజాల నిర్మితం. కణం లోపల ఉండే పొటాషియానికి, కణం బయట ఉండే సోడియానికి ఉండే పరిమాణ నిష్పత్తి 8:1బీ ఇది సృష్టి ధర్మం. ప్రకృతి దత్తమైన ఆహార పదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియముల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. మన ఆహార సేవన లో ఈ రెంటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవాలి. మనం వంట వండే విధానం స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గిపోయి, సోడియం గణనీయంగా పెరిగిపోవటం. ఇది ప్రమాదకరం. లవణాన్ని ఎక్కువ తినకూడదని ఆయుర్వేదం చెప్పింది. చరక సంహిత విమానస్థానంలో, “అధ ఖలు త్రీణి ద్రవ్యాణి న అతి ఉపయుంజీతాధికం… పిప్పలీ క్షారం లవణమితి’ అంటే పిప్పళ్లు, క్షారం (కొన్ని ద్రవ్యాల నుండి వెలికి తీసిన గాఢమైన సారం), ఉప్పు ఎక్కువ తినవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి 3 – 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. (బయట కొన్న ఉప్పు, ప్రకృతి ద్రవ్యాలైన పళ్లు, ఆకు కూరలు, శాకాలు, పాలు మొదలైనవి కలిపి). కాని మనం రోజుకి 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం అనేక రోగాలకు దారి తీస్తుంది. పరిమిత పరిమాణంలో… సంహితలో: లవణం స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్ని కృతి స్వేహనః స్వేదనః తీక్షణి రోచనః ఛేద భేద కృత్ రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరుగు తుంది. శరీరంలో కొవ్వును, కంతులను కరిగించి జడత్వాన్ని పోగొడుతుంది. స్వేదాన్ని కలిగిస్తుంది.

అతిగా సేవిస్తే అనర్థాలు
రక్తస్రావం, దప్పిక పెరుగుతాయి. బలం నశిస్తుంది. విషతుల్యం. సంధులలో వాపు పుడుతుంది. జుత్తు నెరుస్తుంది. బట్టతల, చర్మంలో ముడతలు, ఇతర చర్మ వికారాలు కలుగుతాయి.

సోతియుక్తో అస్రపవనం ఖలితం పలితం పలిమ్ తృట్ కుష్ఠ విషవిసర్పాన్ జనయేత్ క్షపయేత్ బలమ్. శరీరంలో నీటిని నిల్వ ఉండేట్టు చేసి, ఊబకాయం, వాపులు కలుగచేస్తుంది. రక్తనాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్త ప్రసరణకు అవరోధం కలిగిస్తుంది. తద్వారా బీపీ పెరిగి.. పక్షవాతం, హార్ట్ ఎటాక్, కీళ్లవాపులు వంటి వ్యాధులకు దారి తీస్తుంది. నేటి జీవనశైలి వలన ఈ వ్యాధులు కలగడానికి మరింత దోహదం చేస్తుంది. మన రక్తంలోని గ్లూకోజ్.. కణాలలోనికి ప్రవేశించినప్పుడే శక్తి లభిస్తుంది. కణం యొక్క పొరను దాటి గ్లూకోజ్ లోపలకి వెళ్లాలంటే ఇన్సులిన్ హార్మోను అవసరం. అక్కడ ఇన్సులిన్ సక్రమంగా పనిచెయ్యాలంటే ఉప్పు తక్కువ స్థాయిలో ఉండా లి. అందువల్లే మధుమేహ రోగులు ఉప్పు తక్కువ తినాలి. ఇటీవలి కాలంలో జపాన్ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.


ఐదు రకాల లవణాలు
సాముద్ర లవణం (90 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది), ఔద్భిజ లేక రోమ లవణం (70 శాతం n. సైంధవ లవణం (టౌఛిజు ట: 70% 4) బిడాల లవణం (కరక్కాయ, ఉసిరికాయ వంటి కొన్ని ద్రవ్యాల సారాన్ని తీసి, ప్రత్యేకంగా తయారుచేస్తారు. 40% N) సౌవర్చ లవణం (భూమిలోని లోపలి పొరలు, నదీ తీర ప్రాంతాలు దీనికి మూలాధారం. 30% N)

తప్పించుకోవడం ఎలా?
నిషిద్ధం: ఊరగాయలు, నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వంటివి, ఉప్పు కారం చల్లిన వేపడాలు, డీప్ ఫైలు మానేయాలి. ఉడికించిన కూరలలో నామ మాత్రం ఉప్పు అలవరచుకోవాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి పోకూడదు. బజారులో ఉప్పు కొనడం తగ్గించాలి.


సేవించవలసినవి
ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పాలు, బీట్ రూట్, ముల్లంగి, ఆకు కూరలు, గ్రీన్ సలాడ్సు మొదలైనవి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరకురసం వంటివి. కాయగూరలు, పండ్లు మొలే నవి పెస్టిసైడ్స్, కార్బైడ్స్ యొక్క విష ప్రభావాలకు గురైనవే మనకు లభిస్తున్నాయి. ఆ విషాల్ని కొంతవరకు నాశనం చేయాలంటే… గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాలు ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో కాయగూరల్ని కాని, పళ్లని కాని ఓ అరగంట నానబెట్టి, అనంతరం మంచినీటితో రెండు మూడు సార్లు కడుక్కోవాలి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%89%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a4%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a1%e0%b0%82-%e0%b0%ae%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81/feed/ 0 4744
పండ్లు, జ్యూస్ లతో పొందండి సంపూర్ణ ఆరోగ్యం http://www.goodinfochannels.com/%e0%b0%aa%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%82%e0%b0%a6%e0%b0%82%e0%b0%a1/ http://www.goodinfochannels.com/%e0%b0%aa%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%82%e0%b0%a6%e0%b0%82%e0%b0%a1/#respond Sat, 23 Jan 2021 13:31:26 +0000 https://teluguinfo.net/?p=206 వేసవిలో వచ్చే పండ్లు అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి పుచ్చకాయ, తర్భూజ. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి.
ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో ఎర్రగా ఉండే లైకోఫిన్ అనే గుజ్జు వేసవిలో చర్మంలోని సహజ కణజాలం దెబ్బతినకుండా రక్షిస్తుంది
ద్రాక్ష తింటే దాహం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది రక్తశుద్ధి చేయడంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది. ద్రాక్ష జ్యూస్ కూడా ఎంతో మంచిది.
పైనాపిల్ నీటి శాతంతో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో జీర్ణశక్తిని వృద్ది చేస్తుంది. వీటిలోని విటమిన్ల కలయిక శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా చేస్తాయి. రుచిగా కూడా ఉంటుంది.
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. శరీరంలోని వేడి తగ్గించేందుకు నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తీసుకుంటే దాహం తీరడంతో పాటు శక్తి లభిస్తుంది.

ప్రకృతి అందించిన ఫలాల్లో రారాజు మామిడి. వేసవి ప్రారం భంలోనే మామిడి కాయలు వస్తాయి. మామిడి ఫలాలలో ఐరన్, ప్రొటీన్స్, ఎ,సి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ను నివారించే బీటా కెరోటిన్ కూడా మామిడిలో ఎక్కువ.

కమలాఫలంలో పొటాషియంతో పాటు పోషకాలు మెండు ఎండాకాలం అంటేనే రోజు రోజుకు పెరిగే ఉష్ణోగ్రతలు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ భయపడేలా చేస్తాయి. ఈ కాలంలో ఎక్కువగా పండ్లు తీసుకుంటే కొంత ఉపశమనం పొందవచ్చని
నిపుణులు చెపుతుంటారు.

శరంలో తగ్గే గ్లూకోజ్ శాతాన్ని పెంచేందుకు పండ్లు ఉపకరిస్తాయని వైద్యులు చెపుతారు.
తప్పనిసరిగా పండ్లు తింటే వేసవి తాపాన్ని, తట్టుకోవచ్చని కూడా చెపుతారు. అందుకే క్రమం తప్పకుండా పండ్లు తింటే మంచిది.

రోజూ సుమారు ఆరు లీటర్ల మంచినీరు తాగాలి. ఇలా చేస్తే ఎలాంటి వ్యాధులురావు. వేసవిలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు

వేసవి కాలంలో లభించే కర్భూజాలో శరీరానికి అవసరమైన నీటితో పాటు పోషకాలు లభిస్తాయి పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. వేసవిలో వచ్చే పుచ్చకాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ పండ్లలో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇక కొబ్బరిబొండంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి ఈ కాలంలో డీ హైడ్రేషన్ సుంచి కాపాడుకునేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో కార్బొహైడ్రేట్లు కూడా లభిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెంచుతుంది. డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తలకు రక్షణతో పాటు కళ్లజోడు పెట్టుకోవాలి. గొడుగులు కూడా తప్పనిసరిగా ఉయోగించాలి. అల్ట్రావైలెట్ కిరణాలు శరీరంపై పడినప్పుడు సన్ బర్న్, స్కిన్ ఇన్ ఫెక్షన్ రాకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి ఎండలో తిరుగుతున్నప్పుడు కళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
విశ్రాంతి కోసం రోజ్ వాటర్ వేయడం, కళ్లపై కీర దోసకాయ ముక్కలు పెట్టుకోవాలి. వేసవికి కాటన్ దుస్తులు ధరించడం మేలు.
ఎండలో నుండి ఇంటికి రాగానే పండ్ల రసాలు తీసుకోవడం వల్ల కొంతవరకు ఎండ నుంచి వచ్చే వేడి, వడదెబ్బను నివారించవచ్చు.

పైనాపిల్, ద్రాక్ష, రసాలతో పాటు క్యారెట్ జ్యూస్ కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఎండలో తిరిగి అనారోగ్యానికి గురయితే శరీరంపై ఐస్ ముక్కలు లేదా తడిగుడ్డ ఉంచడం పల్ల ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చు. గ్లూకోస్, ఎలక్ట్రాల్ పౌడర్, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. అలాగే చల్లని గాలి తగిలేలా పడుకోవాలి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%aa%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8a%e0%b0%82%e0%b0%a6%e0%b0%82%e0%b0%a1/feed/ 0 4736
మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. http://www.goodinfochannels.com/%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%b6%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d/ http://www.goodinfochannels.com/%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%b6%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d/#respond Thu, 14 Jan 2021 18:16:09 +0000 https://teluguinfo.net/?p=198 రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి మనిషిని బలహీనంగా మారుస్తుంది.అలాగే ఐరన్(ఇనుము) లోపానికి కూడా దారితీస్తుంది. ఐరన్ లోపం అనేది తీవ్రతరం అయితే అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఈ సమస్య కారణంగా ఎర్ర రక్త కణాల సంఖ్య- లేదా వాటి ఆక్సిజన్ మోసే సామర్థ్యం శారీరక అవసరాలను తీర్చడానికి సరిపోదు.
యునిసెఫ్ నివేదిక ప్రకారం భారత్ లో 15-19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలలో 56 శాతం బాలురులో 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శరీరంలో ఇనుము స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని సాధారణ గృహ నివారణలను కూడా సూచించారు. అవేంటంటే


మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.

నల్ల నువ్వులు :
వీటిలో ఇనుము, రాగి, జింక్, సెలీనియం విటమిన్- బి6, ఇ తో పాటు ఫోలేట్లు పుష్కలంగా లభిస్తాయి.
ఎలా తినాలి :
సుమారు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు, డ్రై రోస్ట్ లను ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నెయ్యితో కలపండి. ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకుని తినండి. ఇనుము లోపం ఎక్కువగా ఉన్నవారు ఈ లడ్డూలను తప్పకుండా తీసుకోండి.

కర్జురా, ఎండుద్రాక్ష :
ఈ పొడి పండ్ల కలయిక ఇనుము, మెగ్నీషియం రాగి, విటమిన్లు- ఎ మరియు సి లను కలిగి ఉంటాయి.
ఎలా తినాలి :
2-3 కర్జూరాలు, ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షను ఉదయాన్నే అల్పాహారంగా, లేదా సాయంత్రం పూట స్నాక్ లాగా తిన్నారంటే మీరు తక్షణ శక్తిని పొందటమే కాక, ఐరన్ స్థాయిలను కూడా పెంచుకోవచ్చు.

బీట్‌రూట్లు, క్యారెట్లు :
తాజా బీట్ రూట్, కారెట్లు కలిపి చేసిన జ్యూస్ తాగడం వల్ల ఇనుము శోషణ పెరుగుతుంది. నిమ్మరసం దీనికి విటమిన్- సి కంటెంట్ను జోడిస్తుంది.
ఎలా తినాలి :
ఒక కప్పు తరిగిన బీట్ రూట్, కప్పు తరిగిన క్యారెట్లు వేసి మిక్సీ పట్టండి. ఈ రసాన్ని వడకట్టి దీంట్లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. ప్రతిరోజూ ఉదయం ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగాలి.


వీట్ గ్రాస్ :
ఇది బిటా కెరోటిన్, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ విటమిన్ సి అనేక బి విటమిన్ల అద్భుతమైన మూలాన్ని అందిస్తుంది. అంతేకాదు అనేక రకాల రక్త నిర్మాణ కారకాలను కలిగి ఉంటుంది.
ఎలా తినాలి :
ప్రతిరోజూ ఉదయం ఒక టీస్పూన్ వీట్ గ్రాస్ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడటమే కాక, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


మోరింగా ఆకులు :
మోరింగా విత్తనాలు ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఇనుము విటమిన్లు ఎ, సిలతో పాటు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
ఎలా తినాలి :
ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఉదయం 1 స్పూన్ మోరింగా ఆకు పొడి తింటే శరీరంలో ఐరన్ లెవెల్ పెరుగుతాయి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%b6%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d/feed/ 0 4735
శరీరం విపరీతంగా లావెక్కుతోందా ! ఇవి పాటించండి http://www.goodinfochannels.com/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%b2%e0%b0%be%e0%b0%b5%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81/ http://www.goodinfochannels.com/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%b2%e0%b0%be%e0%b0%b5%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81/#respond Mon, 11 Jan 2021 12:05:39 +0000 https://teluguinfo.net/?p=192 నేడు స్త్రీలకి పనులు తక్కువై శరీరం విపరీతంగా లావెక్కుతోంది. ముఖ్యంగా 20 ఏళ్ల యువకులు, వధువల కోసం వెతికే పెళ్లికాని ప్రసాదులకు పాపం లావిష్టిగా ఉన్న అమ్మాయిలే ఎక్కువగా తగలటంతో పెళ్లి కాకుండా ఉండిపోతున్నారని ఒక సర్వేలో తేలింది.

ఆడపిల్లల చేత ఇంటిపనులు చేయించటం ముఖ్యం. హై.బి.పి షుగర్ హార్ట్ ఎటాక్ రాకుండా వాకింగ్ కూడా చేస్తుండాలి. గుడికెళ్లటంతో భక్తిముక్తి కూడా లభిస్తుంది. ఇంట్లో చీపురు పట్టి ఊడ్చి ముగ్గువేసే ఆడపిల్ల నేడు కనపడటం లేదు పనిమనిషి ఉందనే నిర్లక్ష్యం ఎక్కువైంది. శారీరక శ్రమంటే బరువులు మోయక్కర్లేదు, మెట్లు ఎక్కి దిగండి. బట్టలు జాడిం చండీ వాషింగ్ మిషన్ ఉంది అనుకుంటే, మీ అపార్ట్మెంట్ పై నించి కిందకి కనీసం 3 ఫ్లోర్స్ ఎక్కి దిగండి చాలు పదిసార్లు అలసిపోయే దాకా.

వంటిల్లే వ్యాయామశాల భుజాల నొప్పికి, మిక్సీ వాడకుండా చక్కగా బండరోలు వాడండి. మణికట్టు, చేతి వ్రేళ్లకు మంచి వ్యాయామం. పిండి తడిపి బాగా మెత్తగా పిసకటం, వత్తటం కాల్చటం వల్ల చేతులకి వ్యాయామం అవుతుంది. అంట్లు తోమటం, బాత్రూం టైల్స్ శుభ్రం చేయటం, టబ్స్ పాచిని వదలగొట్టడం గార్డేనింగ్, మొక్కల కొమ్మలు కత్తిరించటం, నీరుపోయటం వల్ల చేతి కండరాలు గట్టిపడతాయి. స్వయంగా షాపుకి వెళ్లి షాపింగ్ చేయటం వల్ల మానసికంగా రిలాక్స్ అవుతారు.

నా పని నేను చేయాలి అనే గాంధీజీ మాటల్లో ఎంతో సత్యం, ఆరోగ్యం ఇమిడి ఉన్నాయి. పనిమనిషిని మానిపించి, ఆడ మగ, పిల్ల పెద్ద ఎవరైనా సరే వారి కప్పు, గ్లాసు, కంచం తోమి కడగడం ఎవరి బట్టలు వారు ఉతికి ఆరేయడం మొదలుపెడితే రోగాలు మటు మాయం అవుతాయి సుమా! అలాగే చిన్నా చితకా ఆరోగ్యంగా ఉండాలంటే కుర్చీకి రెస్టు ఇవ్వాలి. మమ్మల్ని నేలమీద కూలబడమంటారా అని కాదు. అలా కుర్చీకి అతుక్కుపోతే, లాంగ్ సిట్టర్ అయితే హార్టు, షుగర్ పేషెంట్స్ అవటం ఖాయం. డెస్క్ జాబ్ చేసే వారి సిట్టింగ్ అవర్స్ చూడండి. నిద్రకి ఎనిమిది గంటలు వదిలేస్తే మిగతా 90శాతం అలా కూచుని టి.వి.తో, ఆఫీసు పనితో గడిపేస్తారు ఇలా కూచోటంతో మెటబాలిక్, కార్డియో వాస్క్యులర్ సిస్టంకి నష్టం కలుగుతుంది.

దీనితో హైపర్ టెన్షన్, కార్డియో వాస్కులర్ డిసీజ్, ఒబెసిటీ, టైప్-2 షుగర్, కేన్సర్ వచ్చే ఛాన్సు ఎక్కువ. అమెరికన్ పరిశోధన ప్రకారం అలా కుర్చీకి అతుక్కుపోవటం త్వరగా చావుని కొనితెచ్చుకోవటమే.

పైగా హిప్, స్పైన్, షోల్డర్, నెక్ పెయిన్ కి బాధ్యులం మనమే అవుతాం. కండరాలు ఒకే పొజిషన్ కి అలవాటు పడి పూర్ బాడీ బాలెన్స్, కధలకపోవటం జరిగే ప్రమాదం ఉంది. కి- బోర్డుపై వంగి టైపింగ్ చేస్తే అలా వంగి నడవటమే అలవాటు అవుతుంది. కాళ్లను క్రాస్ చేసి కూచుంటే హిప్, లోయర్ బాడీ ప్రభావితం అవుతుంది.

మరి లాంగ్ సిట్టింగ్ కి ఎలా బ్రేక్ ఇవ్వాలి?

మొబైల్లో ప్రతి గంటకీ ఐదునిమిషాలు బ్రేక్ ఇవ్వాలి అనేలా అలారం సెట్ చేయాలి టి.వి ముందు అలా కూలబడకుండా కాసేపు అటు ఇటు నడుస్తూ కళ్లకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు పచ్చికూరగాయలను ఆహారంగా తీసుకోండి. ఇవి ఆకలిమితంగా ఉండటానికి జ్ఞాపకశక్తికి చక్కని శరీరాకృతికి మంచి ఛాయ రావడానికి తోడ్పడు తుంది. మధ్యాహ్న భోజనంలో అన్నం ఆకుకూరలు,పప్పు మజ్జిగ తీసుకోవాలి. భోజనానికి ముందుగా ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఒక టమాట లేదా ఓ దోసకాయ మిరియాలపొడి చల్లుకు తినాలి. కాఫీ టీలు చాలా వరకు తగ్గించాలి. ఒకటి లేదా రెండు సార్లు తాగితే పరవాలేదు నిమ్మరసం వారానికి ఒకసారి తాగితే ఎంతో మంచిది. అంతే కాకుండా వర్క్ చేసేటపుడు అలాగే కుర్చీలో కాకుండా కొంచెం సేపు ఎక్సర్ సైజ్ బాల్ పై కూచుంటే మజిల్స్ యాక్టివ్ గా ఉంటాయి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%aa%e0%b0%b0%e0%b1%80%e0%b0%a4%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%b2%e0%b0%be%e0%b0%b5%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81/feed/ 0 4734
చుండ్రు తగ్గట్లేదా ? ఇలా చేసి చూడండి. http://www.goodinfochannels.com/%e0%b0%9a%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a4%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b0%be-%e0%b0%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%9a/ http://www.goodinfochannels.com/%e0%b0%9a%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a4%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b0%be-%e0%b0%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%9a/#respond Sat, 09 Jan 2021 13:41:52 +0000 https://teluguinfo.net/?p=185 ముఖానికి అందం తెచ్చే వాటిలో కీలకమైనది. మగవారి కంటే లేడీస్ కి జుట్టు ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎంత ఎక్కువ జుట్టు ఉంటే అంత ఎక్కువ ఆనందం ఉంటుంది. అందువల్ల జుట్టును కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

ఈ భూమిపై మనిషి పుట్టినప్పటి  నుండి  ఉన్న సమస్యల్లో ఒకటి చుండ్రు, తలలో జుట్టు నుంచీ పొడి లాంటిది రాలుతూ ఉంటుంది అది అప్పుడప్పుడూ దురద కూడా తెప్పిస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే డేంజరే ..

ఇంతకీ ఆ చుండ్రు ఎందుకొస్తుందంటే తలలో పేలు ఉండటం వల్లే. ఒక్క పేను  ఉన్నా చాలు అది జుట్టును సర్వనాశనం చేస్తుంది. ఎప్పుడో రాలిపోయే జుట్టును .. ఇప్పుడే రాలిపోయేలా చేస్తుంది. బట్టతల ఇతర సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు. మన జుట్టులోంచీ ఇతరుల జుట్బులోకి కూడా పేనులు ఈజీగా వెళ్లగలవు వాటికి చెక్ పెట్టేందుకు మనం ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వాచ్చు. ఎలాగో తెలుసుకుంది.

కర్పూరం:

తలలో పేలను తరిమి తరిమి కొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం కర్పూరం వాడకం. ఏం చెయ్యాలంటే మీరు వాడే షాంపూలో కాస్త కర్పూరం కూడా కలపండి. అలాగే మీరు వాడే కొబ్బరి నూనెలో కూడా కర్పూరు కలిపి తలకు రాసుకోండి ఏదో కొత్త పదార్ధం దొరికింది అనుకొని పేలు కర్పూరాన్ని తింటాయి. అప్పుడవి చచ్చిపోతాయి. ఎందుకంటే క్రిములనూ సూక్ష్మజీవులని  సర్వనాశనం చేయగలిగే శక్తి కర్పూరానికి ఉంది.

వేప :

ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం లో  తప్పని సరి ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే అది వేప అని చెప్పుకోవచ్చు. వేపలో  సూక్ష్మజీవులని చంపేసే యాంటి ఇన్ఫోమెటరి గుణాలు బోలెడన్ని ఉన్నాయి. వేప నునూ లేదా వేప పేస్ట్ ఏదైనా సేకరించండి. లేదా వేపాకుల్ని గుజ్జులా చేసి పిండితే రసం వస్తుందిగా దాన్ని సేకరించుకోండి. దాన్ని తలకి బాగా పట్టించండి ఓ పావు గంట అలా జుట్టును ఆరనివ్వండి. ఆ తరువాత చుండ్రుతో పాటు పేలూ పోతాయి.

ఈ భూమిపై మనిషి పుట్టినప్పటి  నుండి  ఉన్న సమస్యల్లో ఒకటి చుండ్రు, తలలో జుట్టు నుంచీ పొడి లాంటిది రాలుతూ ఉంటుంది అది అప్పుడప్పుడూ దురద కూడా తెప్పిస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే డేంజరే ..

ఇంతకీ ఆ చుండ్రు ఎందుకొస్తుందంటే తలలో పేలు ఉండటం వల్లే. ఒక్క పేను  ఉన్నా చాలు అది జుట్టును సర్వనాశనం చేస్తుంది. ఎప్పుడో రాలిపోయే జుట్టును .. ఇప్పుడే రాలిపోయేలా చేస్తుంది. బట్టతల ఇతర సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు. మన జుట్టులోంచీ ఇతరుల జుట్బులోకి కూడా పేనులు ఈజీగా వెళ్లగలవు వాటికి చెక్ పెట్టేందుకు మనం ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వాచ్చు. ఎలాగో తెలుసుకుంది.

కర్పూరం:

తలలో పేలను తరిమి తరిమి కొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం కర్పూరం వాడకం. ఏం చెయ్యాలంటే మీరు వాడే షాంపూలో కాస్త కర్పూరం కూడా కలపండి. అలాగే మీరు వాడే కొబ్బరి నూనెలో కూడా కర్పూరు కలిపి తలకు రాసుకోండి ఏదో కొత్త పదార్ధం దొరికింది అనుకొని పేలు కర్పూరాన్ని తింటాయి. అప్పుడవి చచ్చిపోతాయి. ఎందుకంటే క్రిములనూ సూక్ష్మజీవులని  సర్వనాశనం చేయగలిగే శక్తి కర్పూరానికి ఉంది.

వేప :

ప్రాచీన కాలం నుంచి ఆయుత్వేదం లో  తప్పని సరి ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే అది వేప అని చెప్పుకోవచ్చు. వేపలో  సూక్ష్మజీవులని చంపేసే యాంటి ఇన్ఫోమెటరి గుణాలు బోలెడన్ని ఉన్నాయి. వేప నునూ లేదా వేప పేస్ట్ ఏదైనా సేకరించండి. లేదా వేపాకుల్ని గుజ్జులా చేసి పిండితే రసం వస్తుందిగా దాన్ని సేకరించుకోండి. దాన్ని తలకి బాగా పట్టించండి ఓ పావు గంట అలా జుట్టును ఆరనివ్వండి. ఆ తరువాత చుండ్రుతో పాటు పేలూ పోతాయి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%9a%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a4%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b0%be-%e0%b0%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%9a/feed/ 0 4732