Skip to content

Creative Activities for Childrens

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సర్ది చెప్పలేక వారిని ఇంట్లోనే ఉండేలా చేయటానికి ఫోన్స్ ఇచ్చేస్తారు. లేదా వీడియా గేమ్ అలవాటు చేస్తారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్స్ కి అలవాటు చేసిన వారు అవుతారు. కాబట్టి అలా కాకుండా వారిలో సృజనాత్మకత

పెరిగేలా వారిని ప్రోత్సహించాలి. ఎందుకంటే చిన్న వయసులో మెదడు అతి వేగంగా కొత్త వస్తువులను, అంశాలను గురించి తెలుసుకోవటమే కాక, వాటిని రికార్డ్ చేసుకుంటుంది. చిన్నప్పుడు ఎక్కువ విషయాలను గురించి తెలుసుకున్న పిల్లలు పెద్దయిన తరువాత కొత్త విషయాలను చాలా సులభంగా నేర్చుకో గలుగుతారు. ప్రజంట్ చాలామందికి వర్క్ ఫ్రమ్ హెం ఆప్షన్ ఇచ్చారు. ఈ సమయంలో చిన్నా, పెద్దా అంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక పిల్లలకి బయటికి వెళ్లి ఆడుకునే ఛాన్స్ లేదు. పెద్దలకు వారిని అడుకునే అవకాశం ఉండటం లేదు. కరోనా దెబ్బకి మొత్తం ప్రపంచమే లాక్  డౌన్లోకి వెళ్లిపోయింది. ప్రతిదేశం కూడా లాక్డౌన్ అమలు చేస్తున్నది.

కరోనాకి మందు లేకపోవడంతో ఒకరిని నుంచి మరొకరికి అంటుకోకుండా ఉండటానికి ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో పాఠశాల నుంచి షాపింగ్ మాల్స్ వరకూ అన్నింటిని మూసేసారు. పాఠశాలలు సెలవుల నేపథ్యంలో ఈ ఖాళీ సమయంలో పిల్లలు బయటికి వెళ్లి ఆడుకోవాలని ప్రయత్నిస్తారు. వారిని అడ్డుకోవడానికి తల్లి దండ్రులు పథకాలు రచించడం షరా మామూలు అయింది. ఎందుకంటే హాలిడేస్ ఇచ్చింది.

ఎంజాయ్  చేయడానికి కాదు కదా. ఒక విపత్కర సమస్యతో పోరాడుతున్నాం కాబట్టి అందరూ కూడా దానికి సహకరించాలి.. పిల్లలు మారాం  చేసినా ఏమి చేసినా కూడా బయటికి మాత్రం పంపకూడదు. అయితే వారిని అదుపు చేయాలంటే ఏం చేయాలి. ఎప్పుడూ వారిని బిజీగా ఉంచడమే. ఎందుకంటే పిల్లలతో గడపడానికి తల్లిదండ్రులకు కూడా సమయం కుదరడం లేదు. చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో ఈ లాక్ డౌన్  ద్వారా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కొన్ని -సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

సామాజిక దూరం, ఇంట్లో ఉండటం కాబట్టి తల్లిదండ్రులు ఇంట్లోనే ఇంటి పనులు, ఆఫీస్ పనులు వీటన్నింటినీ ఎలా చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బయటికి వెళ్లి ఆడకుండా ఇంట్లోనే పిల్లలను ఎలా బిజీగా ఉంచాలో అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. పోని ఇంట్లోనే ఆడుకునేలా వదిలేద్దామా అంటే ఇల్లంతా గోల గోల చేసే చేస్తారు. దీంతో ఇంట్లో అమ్మానాన్నల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పిల్లల్ని ఈ వేసవిలో ఎలా కట్టుదిట్టం చేయాలి. వారిని ఎలా బిజీగా ఉంచాలి అనే ఆలోచనలు తల్లిదండ్రులను సతమతం చేస్తుంటాయి. అందుకే ఈ సెలవుల్లో వారిని బిజీగా ఉండేలా చూడాలి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సర్ది చెప్పలేక వారిని ఇంట్లోనే ఉండేలా చేయటానికి ఫోన్స్ ఇచ్చేస్తారు. లేదా వీడియో గేమ్ అలవాటు చేస్తారు. ఆ కానీ అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల పిల్లలు స్మార్ట్ ఫోన్ కి అలవాటు చేసిన వారు అవుతారు, కాబట్టి అలా కాకుండా వారిలో సృజనాత్మకత పెరిగేలా వారిని ప్రోత్సహించాలి.

ఎందుకంటే చిన్న వయసులో మెదడు అతి వేగంగా కొత్త వస్తువులను, అంశాలను గురించి తెలుసు కోవటమే కాక, వాటిని రికార్డ్ చేసుకుంటుంది. చిన్నప్పుడు ఎక్కువ విషయాలను గురించి తెలుసుకున్న పిల్లలు పెద్దయిన తరువాత కొత్త విషయాలను చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి పిల్లలకు కూడా కొత్త కొత్త విషయాలను పరిశీలించాలనే ఆసక్తి, జ్ఞాపకం ఉంచుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇంటి నుండి పనిచేసేటప్పుడు పిల్లలు సరదాగా గడిపేలా చేసేందుకు ప్రయత్నించాలి. కలర్ బ్లాకింగ్ అనేది పిల్లలతో పెయింటింగ్ ప్రారంభించడానికి ఒక ఆహ్లాదకరమైన, సులభమైన మార్గం. ఉదాహరణకు, పిల్లల కోసం కట్టిన బెడ్ రూమ్ ని సగానికి విభజించి, గోడ భాగం సగానికి వేరే రంగును వేయిం చాలి. దీని కోసం పసుపు, గులాబీ వంటి బైట్ కలర్స్ వేయడం వల్ల పిల్లలకు ఉల్లాసమైన శక్తివంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

ఇలా చేయడం వల్ల పిల్లలకు సరదాగా ఉంటుంది. దీని వల్ల పిల్లలకు రంగులు వేయా లన్న ఆసక్తి పెరుగు తుంది. పెయిం టింగ్ మీద ఆసక్తి పెరుగుతుంది. కలర్ -బ్లాకింగ్ పిల్లలతో సృజనాత్మకతను కలిగిస్తుంది. పిల్లలను కొంత సేపు ఆహ్లాదకరంగా ఉంచటానికి ఇది ఒక మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే పిల్లలు సెలవుల సమయంలో బయటికి వెళ్లి ఆడుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో అస్సలు బయటికి వెళ్లకూడదు. అందుకే ఇంట్లోనే ఉండి సృజనాత్మకంగా ఆలోచించడానికి లెగో బాక్స్ లాంటివి ఉత్తమమైనవి.

ఎందుకంటే పిల్లలకు లెగో బాక్స్ ఒకటి ఇచ్చి ఒక చాప మీద కూర్చోబెట్టి కొన్ని క్రేజ్ బిల్డింగ్స్ చేయమని చెప్పాలి. ఆ లోగో బాక్స్ పిల్లలకు సృజనాత్మకంగా మారేందుకు సాయపడతాయి. ఏకాగ్రత పెరగటానికి కూడా సహాయపడతాయి. లెగో బాక్స్ కేవలం పిల్లలకు ఆడుకోవడం మాత్రమే కాదు, పెద్దలకు కూడా ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది. మీకు చాలా సమయం ఉంది. వస్తువులను కొనడానికి తక్కువ అవకాశాలు ఉన్నందున, డై కార్యకలాపాలను ఆశ్రయించాలి. ఇవి పిల్లలకు ఉత్తేజకరమైనవి. ఎందుకంటే అవి కొత్తవి, ఉపయోగకరమైన అంశానలు సృష్టించగలవు.

మీరు ఇష్టపడే. మీ సోషల్ మీడియా అకౌంట్స్ లో సేవ్ చేస్తున్న వీడియోల ద్వారా సర్వ్ చేయండి. మీ ఇంటికి ఉత్తమమైన వాటిని ఎంచుకోండి. ఇది సరదాగా ఉంటుంది. కొన్ని విషయాలకు పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హం చేస్తున్నప్పుడు మనం పనిచేస్తున్నట్లు వారికి అర్ధం య్యే విధంగా గదిని అలంకరించాలి. అల్మారాలకు రంగులు వేయండి. లేదా ఏదైనా చిన్న ఫర్నిచర్ ఆ గదిలో పెట్టడానికి ప్రయత్నించండి. దీనికోసం స్థలం అంతటా యాస రంగులను వేయండి. స్థలాన్ని కళాత్మక ఆఫీస్ గా చూడటానికి ఇది సులభమైన మార్గం. దీనివల్ల ఆఫీస్లో ఉన్న భావన కలుగుతుంది. ఇంటి భావన నుండి పిల్లలకు పనిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక సూక్ష్మ మార్గం. దీని వల్ల పిల్లలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *