Skip to content

Donkey ride for ‘newest son-in-law’ in Holi tradition in vida village | ఆ ఊరిలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గాడిద మీద ఊరేగిస్తారు!

భారతదేశంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలకు నిలవు. అందులో కొన్ని వింతగా కూడా ఉంటాయి. అయితే ఆచార వ్యావహారాలు ఎలా ఉన్నా పాటించడం మాత్రం పక్కాగా పాటిస్తుంటాం. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో హోలీ రోజున ఒక వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. వినడానికే కాదు ఆచరించడానికి కూడా కొంచెం వింతగా ఉంటుంది. కానీ తప్పదు మరి. ఆ గ్రామంలో కొత్త అల్లుడిని హోలీ రోజు గాడిద ఎక్కించి ఊరేగిస్తారట ! ఇదేం ఆచారం బాబు అనుకుంటున్నారా. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లి చూద్దాం..


బరాబర్ గాడిద ఎక్కాలి…


మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోగల విదా గ్రామంలో 90 ఏళ్ల క్రితం ఈ ఆచారం మొదలైంది. దీన్ని అదే గ్రామానికి చెందిన ఆనందరావు దేశముఖ్ ప్రారంభించారు. అప్పట్లో ఆనందారావు తన అల్లుడిని గాడిద ఎక్కించి ఊరేగించి ఆపై చివర్లో కొత్తబట్టలు పెట్టారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ ఊరిలో హోలీ రోజు ఈ తంతు జరుగుతోంది. ముందుగా గ్రామంలో కొత్త అల్లుళ్లు ఎవరు ఉన్నారో తెలుసుకుంటారు. ఆపై వారి ఈ ఆచారం నుంచి తప్పించుకోకుండా నిఘా కూడా పెడ్తారు. కొత్త అల్లుళ్ల సర్వేకి కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుందట. అందుకోసం ఆ గ్రామంలోని కొందరు ఏకంగా ఇంటింటా సర్వే కూడా చేస్తారు. ఆచారం ప్రకారం ఈ గాడిద సవారీ గ్రామం మధ్య నుంచి మొదలై 11 గంటలకు ఆ ఊరిలోని హనుమాన్ దేవాలయం వద్ద ముగుస్తుంది. ఊరేగింపు ముగింపులో అల్లుడికి నచ్చిన బట్టలు కూడా పెడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *