Skip to content

Nee Prashnalu” Song Lyrics in telugu – Kotha Bangaru Lokam

నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..
ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా….ఓ..ఓ..ఓ..ఓ..

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..
వలపేదో వల వేసింది..వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే రుజువేముంది..ఓ..ఓ..ఓ..ఓ..
సుడిలో పడు ప్రతి నావా..ఓ..ఓ..ఓ..ఓ..చెబుతున్నది వినలేవా..

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా..
కడ తేరని పయనాలెన్ని..పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేశాయా చరిత పుటలు..వెనుజూడక ఉరికే వెతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు….ఓ..ఓ..ఓ..ఓ..

ఇది కాదే విధి రాత….ఓ..ఓ..ఓ..ఓ..అనుకోదేం ఎదురీత..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో..సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా ….ఓ..ఓ..ఓ..ఓ..

“Nee Prashnalu” Song Video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *