#Fastag electronic toll collection complete details 2021 – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Fri, 01 Jan 2021 11:11:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 Fastag- Electronic toll collection complete details 2021| ఎలక్ట్రానిక్ టోల్ ఫాస్టాగ్ ఎలా కొనాలి పూర్తి వివరాలు http://www.goodinfochannels.com/fastag-electronic-toll-collection-complete-details-2021-%e0%b0%8e%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%9f%e0%b1%8b%e0%b0%b2/ http://www.goodinfochannels.com/fastag-electronic-toll-collection-complete-details-2021-%e0%b0%8e%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%9f%e0%b1%8b%e0%b0%b2/#respond Fri, 01 Jan 2021 11:11:49 +0000 https://teluguinfo.net/?p=153 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ ఫాస్టాగ్ తో హైవేలపై టోల్ ప్లాజాల దగ్గర టైమ్ వృథా అయ్యే అవకాశం ఉండదు. రానున్న రోజుల్లో ఫాస్టాగ్ లేకపోతే హైవే ఎక్కే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫాస్టాగ్ ఎక్కడ కొనాలి? ఎలా రీఛార్జ్ చేయాలో ఒకసారి చూద్దాం .


ఫాస్టాగ్ ఎలా కొనాలి?
దీనికోసం చాలా ఆప్షన్లే ఉన్నాయి. మీ కారు కోసం ఫాస్టాగ్ కొనాలంటే నేరుగా టోల్ ప్లాజాల దగ్గరికి వెళ్లవచ్చు. దీనికోసం మీ ఐడీ, వెహికిల్ రిజిస్ట్రేషన్ పత్రాలను కచ్చితంగా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. కేవైసీ ప్రక్రియ కోసం ఇవి తప్పనిసరి. ఇంకా సులువుగా కొనాలనుకుంటే.. అమెజాన్ వెబ్ సైటు లేదా ఈ ఫాస్టాగ్ అందించే బ్యాంక్ వెబ్ సైట్లకు వెళ్లవచ్చు.

ప్రస్తుతానికి ఫాస్టాగ్ ను హెడీఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్ బీ ఐ , కోటక్, యాక్సిస్ బ్యాంకులు అందిస్తున్నాయి. ఇవే కాకుండా మీ ఫోన్ లోని పేటీఎం, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఫాస్టాగ్ కు ఎంత ఖర్చువుతుంది? ఫాస్టాగ్ కు ఎంత ఖర్చువుతుందన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది మీరు ఏ వాహనం కోసం తీసుకుంటున్నారు అంటే కార్, జీప్, వ్యాన్, బస్, ట్రక్, వాణిజ్య వాహనాలు వంటివి. రెండోది.. ఏ బ్యాంక్ నుంచి ఈ ఫాస్టాగ్ ను తీసుకుంటారన్నదానిపై కూడా ధర ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ మీ కారుకు పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకోవాలని అనుకుంటే.. రూ.500 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందులోనే రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ రూ.250, కనీస బ్యా లెన్స్ రూ.150 కూడా ఉంటుంది. ఇక ఇదే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి అయితే.. ట్యాగ్ జారీ చేయడానికి రూ.99.12, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్, రూ.200 కనీస బ్యాలెన్స్ అవసరమవుతుంది. ఫాస్టాగ్లా పై పలు బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి.

రీఛార్జ్ ఎలా?
ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా చాలా ఈజీ. — మీరు ఏ బ్యాంక్ నుంచి కొన్నారో..
దాని ఫాస్టాగ్ వాలెట్ లోకి వెళ్లి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్, లేదా యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా రీఛార్జ్ చేసుకోవాలంటే పేటీఎం, ఫోన్ పై, అమెజాన్ పే, గూగుల్ పేలాంటివి వాడొచ్చు. ఇవి ఏ బ్యాంక్ ఫాస్టాగ్ కైనా రీఛార్జ్ ఆప్షన్ ఇస్తున్నాయి.

]]>
http://www.goodinfochannels.com/fastag-electronic-toll-collection-complete-details-2021-%e0%b0%8e%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d-%e0%b0%9f%e0%b1%8b%e0%b0%b2/feed/ 0 4726