film news in telugu – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Fri, 25 Jun 2021 08:13:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 42 ఏళ్ల వయసులో తలైన హీరోయిన్ సంఘవి http://www.goodinfochannels.com/42-%e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%af%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b0%b2%e0%b1%88%e0%b0%a8-%e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8/ http://www.goodinfochannels.com/42-%e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%af%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b0%b2%e0%b1%88%e0%b0%a8-%e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8/#respond Fri, 25 Jun 2021 08:13:52 +0000 https://teluguinfo.net/?p=359 ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో గుర్తింపు పొందిన హీరోయిన్ సంఘవి మీకు గుర్తున్నారా? తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. తెలుగులో సింధూరం, సమరసింహారెడ్డి వంటి బాక్సాఫీస్ చిత్రాల్లో నటించిన సంఘవి మంచి గుర్తింపు పొందారు. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్మహల్ సినిమాతో తెరంగేట్రం చేసిన సంఘవి.. అసలు పేరు కావ్య. సీతారామరాజు, ఆహా, సూర్యవంశం, మృగరాజు, గొప్పింటి అల్లుడు. ప్రేయసిరావే, సందడే సందడి, రవన్న, శివయ్య, తాతా మనవడు.. ఇలా దాదాపు 40 సినిమాల్లో నటించి హోమ్లీ హీరోయిన్గా పేరు గడించారు. గ్లామర్ చిత్రాల్లో నటించిన సంఘవి.. యువతను ఆకర్శించేలా మోడ్రన్ డ్రస్సుల్లోనూ అలరించింది.

సినిమా హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే 39 ఏండ్ల వయసులో ఐటీ సంస్థ యజమాని వెంకటేశ్ తో 2016 లో సంఘవి వివాహమైంది. ఆ తర్వాత కొన్ని ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్లకు జడ్జిగా హాజరై తెలుగు టీవీ ప్రేక్షకులను పలుకరించింది. అయితే, ఇటీవల సంఘవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురును ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్న ఫొటోను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. 42 ఏండ వయసులో సంఘవి పాపకు జన్మనివ్వడం తో అభిమానులు ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.


15 ఏండ్ల సినీ కెరీర్లో తెలుగు, కన్నడ, తమిళం, మళయాల భాషల్లో నటించిన సంఘవి. తెలుగులో చిరంజీవి. నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ఎన్టీఆర్, శ్రీకాంత్, రాజశేఖర్ వంటి హీరోల సరసన నటించి మెప్పించారు. 2004లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆంధ్రావాలా అనంతరం ఒక్కటి కానీ ఇద్దరు అనే తెలుగు సినిమాలో ప్రత్యేక క్యారెక్టర్ చేసింది. అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంటికే పరిమితమైంది.

]]>
http://www.goodinfochannels.com/42-%e0%b0%8f%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%af%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4%e0%b0%b2%e0%b1%88%e0%b0%a8-%e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8/feed/ 0 359