#health news 2021 – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Fri, 07 May 2021 08:46:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 ఆరోగ్యం కోసం బెల్లం మధురౌషధం http://www.goodinfochannels.com/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81%e0%b0%b0/ http://www.goodinfochannels.com/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81%e0%b0%b0/#respond Fri, 07 May 2021 08:46:39 +0000 https://teluguinfo.net/?p=244

ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధాలుగా మలచుకోవడం ఆయుర్వేద శాస్త్ర విశిష్టత. ఆరు రుచులలోనూ (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) మధుర రసానిదే అగ్రస్థానం. కొన్ని పదార్థాలు నాలుకకు తగలగానే తీపి స్ఫురిస్తుంది. కొన్నింటిలో తీపి అంతర్లీనంగా అనురసంగా ఉంటుంది. వివిధ ఫలాలు, దుంప జాతులు, కొబ్బరి నీళ్ల వంటి ద్రవ్యాలలోని మాధుర్యం అందరికీ తెలిసినదే. బయటకు గట్టిగా కర్రలా ఉన్నా, చెరకులో నిండుగా తీపి ఉంటుంది. చెరకును సంస్కృతంలో ఇక్షు అంటారు.

మన దేశంలో చాలాకాలంగా ఇక్షు రసం నుంచి బెల్లం (గుడం) తయారుచేస్తున్నారు. ఔషధాల తయారీలో, వంటకాలలో బెల్లాన్ని ఉపయోగిస్తారు. సితా (పటిక బెల్లం), ఖండ శర్కర (ఇసుకలా అతి సన్నగా ఉన్న పంచదార), మధు శర్కర (తేనె నుంచి తయారైన పంచదార)… ద్రవ్యాల ప్రయోజనాల గురించి భావప్రకాశ సంహితలో కనిపిస్తుంది. కాని వీటి తయారీ గురించి కనపడదు. ఈనాడు రసాయనిక పదార్థాలతో తయారుచేస్తున్న పంచదారకు, నాటి సహజ సిద్ధమైన శర్కరలకు చాలా తేడా ఉంది. బెల్లం అమోఘమైన పోషకాహారం.

చెరకు బెల్లం – సశాస్త్రీయ వివరాలు

చెరకు రసం: శరీరానికి చలవ చేస్తుంది. వీర్యవర్థకం, కఫకరం. కాచిన చెరకు రసం శరీరం లో వేడిని ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని వాయువుని, కడుపు నొప్పిని పోగొడుతుంది. నిల్వ చేయటం వలన పులిసిన చెరకు రసం మంచిది కాదు (కొన్ని గంటలపాటు పులిస్తే పరవాలేదు). మలమూత్రాలను సాఫీగా జారీ చేస్తుంది. గుణాలు: తియ్యగా, జిగురు (స్నిగ్ధం) గా ఉంటుంది. వాతహరం. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది, కాని శర్కరంత చలవ చేయదు. మూత్రాన్ని సాఫీగా చేసి మూత్ర వికారాలను తగ్గిస్తుంది. వృష్యం (శుక్రకరం, వీర్యవర్థకం), బలవర్థకం. దేహంలో కొవ్వును (మేదస్సు) పెంచుతుంది. కఫాన్ని, క్రిములను పెంచుతుంది. (ఇక్షా రసో యస్సపక్వో జాయతే… సగుడా… వృష్యా గురు: స్నిగ్ధ వాతఘ్నో మూత్ర శోధనః’ నాతి పిత్త హరో మేదః కఫ కృమి బలప్రదః)

కొత్త బెల్లం: జఠరాగ్నిని పెంచుతుంది, కాని కఫాన్ని, కృములను కలుగచేస్తుంది. దగ్గు, ఆయాసాల ను పెంచుతుంది. (గుడో నవః కఫ శ్వాస కాస కృమి కరో అగ్నికృత్)

పాత బెల్లం: చాలా మంచిది (పథ్యం), లఘువు అంటే తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి, పుష్టిని కలిగిస్తుంది. వృష్యం. రక్తదోషాన్ని పోగొడుతుంది. వాతరోగాల్ని తగ్గిస్తుంది. గుడో జీర్ణ లఘుః పథ్యో న అభిష్యంది అగ్ని పుష్టికృత్ పిత్తఘ్నో మధురో వృష్యా వాతఘ్నో అస్పక్ ప్రసాదనః

ఔషధ గుణాలు: బెల్లాన్ని శుంఠి (శొంఠి)తో కలిపి సేవిస్తే, అన్నిరకాల వాతరోగాలు తగ్గుతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు పోతాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే, అన్ని పిత్త రోగాలు ఉపశమిస్తాయి. ఇది మూలవ్యాధి (పైల్స్)ని తగ్గించడానికి మంచి మందు.

మత్స్యండీ: చెరకు రసాన్ని ఒక పద్ధతిలో వేడి చేస్తూ బెల్లాన్ని తయారుచేసేటప్పుడు, చివరన కొంచెం ద్రవాంశలు మిగిలిపోతాయి. దానినే మత్స్యండీ అంటారు. ఇది బలకరం, మృదురేచకం, రక్తశోధకు, వీర్యవర్ధకం. (మత్స్యండీ భేదినీ, బల్యా, బృంహణీ వృష్యా, రక్తదోషాపహాః స్మృతా)

ఆధునిక జీవరసాయన పోషక వివరాలు:

తాటి బెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరకు ల్లాన్నే ఎక్కువ వాడుతున్నారు. దీనిలోని పోషకల విలువలు కూడా విశిష్టం. నూరు గ్రాముల బెల్లంలో ప్రొటీన్లు 0, 4, కొవ్వులు 0, 1, మినరల్స్ 0.6 శర్కరలు (కార్బోహైడ్రేట్స్) 95 శాతం, కాల్షియం 80 శాతం, ఫాస్ఫరస్ 40 శాతం, ఐరన్ 2.64, కేలరీలు 383 ఉంటాయి.

తయారీలో- ఆసక్తికర అంశాలు:

రిఫైన్డ్, డిస్టిలేషన్ చేయకుండా ఉన్నది. మంచి బెల్లం. దీంట్లో కెమికల్స్ వాడకపోవటం వలన అన్ని పోషక ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్) భద్రంగా ఉంటాయి. మట్టిరంగు వంటి నలుపు రంగులో ఉండే బెల్లం ఉత్తమం. దీంట్లో విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యకరం. ఆర్గానిక్ బెల్లం (జాగరీ): ఇది మరింత శ్రేష్ఠం. చెరకును పండించినపుడు కృత్రిమ రసాయనిక ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని వాడరు. బెల్లంలో తెలుపు లేదా ఎరుపు రంగు రావటం కోసం కెమికల్స్ (బేకింగ్ సోడా, కాల్షియం కార్బొనేట్/సున్నం పొడి, జింక్ ఫార్మాల్ డిహైడ్ సల్ఫాక్సిలేటు వంటివి) వాడరు. కనుక పసుపు మిశ్రిత మట్టిరంగులో చూర్ణం రూపంలో ఉంటుంది. సుక్రోజ్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు వార్ధక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి.

కల్తీ బెల్లాలు: నిగనిగలాడే ఎరుపు, తెలుపు, పసుపు రంగులు విరజిమ్మటం కోసం హానికర కెమికల్స్, తీపిని అధికం చేసే కెమికల్స్, నిల్వ ఉండటానికి కెమికల్స్ అధిక మోతాదులో కలుపుతారు. అసలైన మట్టిరంగు కంటె ఈ ఆకర్షిత రంగు బెల్లానికి వినియోగదారులు ఆకర్షితులవుతారు. పంచదార తయారీలో మితిమీరిన తెలుపు, తీపి మినహా పోషక విలువలు ఉండవు. బ్రౌన్ సుగర్ లో బ్లీచింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు నయం. తెల్లటి పంచదార తయారీ లో రసాయనిక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆ పంచదార ఆరోగ్యానికి చేటు చేస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%ac%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%82-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81%e0%b0%b0/feed/ 0 4743
ఉప్పు అతిగా తినడం ముప్పు… http://www.goodinfochannels.com/%e0%b0%89%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a4%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a1%e0%b0%82-%e0%b0%ae%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81/ http://www.goodinfochannels.com/%e0%b0%89%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a4%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a1%e0%b0%82-%e0%b0%ae%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81/#respond Fri, 07 May 2021 08:43:49 +0000 https://teluguinfo.net/?p=248 ఉప్పుని శరీరానికి హితశత్రువు అనుకోవచ్చు. వంటకానికి రుచి తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేసుకుంటుంది ఉప్పు. ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటారు. మానవ శరీరం అసంఖ్యాక కణజాల నిర్మితం. కణం లోపల ఉండే పొటాషియానికి, కణం బయట ఉండే సోడియానికి ఉండే పరిమాణ నిష్పత్తి 8:1బీ ఇది సృష్టి ధర్మం. ప్రకృతి దత్తమైన ఆహార పదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియముల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. మన ఆహార సేవన లో ఈ రెంటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవాలి. మనం వంట వండే విధానం స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గిపోయి, సోడియం గణనీయంగా పెరిగిపోవటం. ఇది ప్రమాదకరం. లవణాన్ని ఎక్కువ తినకూడదని ఆయుర్వేదం చెప్పింది. చరక సంహిత విమానస్థానంలో, “అధ ఖలు త్రీణి ద్రవ్యాణి న అతి ఉపయుంజీతాధికం… పిప్పలీ క్షారం లవణమితి’ అంటే పిప్పళ్లు, క్షారం (కొన్ని ద్రవ్యాల నుండి వెలికి తీసిన గాఢమైన సారం), ఉప్పు ఎక్కువ తినవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి 3 – 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. (బయట కొన్న ఉప్పు, ప్రకృతి ద్రవ్యాలైన పళ్లు, ఆకు కూరలు, శాకాలు, పాలు మొదలైనవి కలిపి). కాని మనం రోజుకి 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం అనేక రోగాలకు దారి తీస్తుంది. పరిమిత పరిమాణంలో… సంహితలో: లవణం స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్ని కృతి స్వేహనః స్వేదనః తీక్షణి రోచనః ఛేద భేద కృత్ రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరుగు తుంది. శరీరంలో కొవ్వును, కంతులను కరిగించి జడత్వాన్ని పోగొడుతుంది. స్వేదాన్ని కలిగిస్తుంది.

అతిగా సేవిస్తే అనర్థాలు
రక్తస్రావం, దప్పిక పెరుగుతాయి. బలం నశిస్తుంది. విషతుల్యం. సంధులలో వాపు పుడుతుంది. జుత్తు నెరుస్తుంది. బట్టతల, చర్మంలో ముడతలు, ఇతర చర్మ వికారాలు కలుగుతాయి.

సోతియుక్తో అస్రపవనం ఖలితం పలితం పలిమ్ తృట్ కుష్ఠ విషవిసర్పాన్ జనయేత్ క్షపయేత్ బలమ్. శరీరంలో నీటిని నిల్వ ఉండేట్టు చేసి, ఊబకాయం, వాపులు కలుగచేస్తుంది. రక్తనాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్త ప్రసరణకు అవరోధం కలిగిస్తుంది. తద్వారా బీపీ పెరిగి.. పక్షవాతం, హార్ట్ ఎటాక్, కీళ్లవాపులు వంటి వ్యాధులకు దారి తీస్తుంది. నేటి జీవనశైలి వలన ఈ వ్యాధులు కలగడానికి మరింత దోహదం చేస్తుంది. మన రక్తంలోని గ్లూకోజ్.. కణాలలోనికి ప్రవేశించినప్పుడే శక్తి లభిస్తుంది. కణం యొక్క పొరను దాటి గ్లూకోజ్ లోపలకి వెళ్లాలంటే ఇన్సులిన్ హార్మోను అవసరం. అక్కడ ఇన్సులిన్ సక్రమంగా పనిచెయ్యాలంటే ఉప్పు తక్కువ స్థాయిలో ఉండా లి. అందువల్లే మధుమేహ రోగులు ఉప్పు తక్కువ తినాలి. ఇటీవలి కాలంలో జపాన్ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.


ఐదు రకాల లవణాలు
సాముద్ర లవణం (90 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది), ఔద్భిజ లేక రోమ లవణం (70 శాతం n. సైంధవ లవణం (టౌఛిజు ట: 70% 4) బిడాల లవణం (కరక్కాయ, ఉసిరికాయ వంటి కొన్ని ద్రవ్యాల సారాన్ని తీసి, ప్రత్యేకంగా తయారుచేస్తారు. 40% N) సౌవర్చ లవణం (భూమిలోని లోపలి పొరలు, నదీ తీర ప్రాంతాలు దీనికి మూలాధారం. 30% N)

తప్పించుకోవడం ఎలా?
నిషిద్ధం: ఊరగాయలు, నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వంటివి, ఉప్పు కారం చల్లిన వేపడాలు, డీప్ ఫైలు మానేయాలి. ఉడికించిన కూరలలో నామ మాత్రం ఉప్పు అలవరచుకోవాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి పోకూడదు. బజారులో ఉప్పు కొనడం తగ్గించాలి.


సేవించవలసినవి
ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పాలు, బీట్ రూట్, ముల్లంగి, ఆకు కూరలు, గ్రీన్ సలాడ్సు మొదలైనవి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరకురసం వంటివి. కాయగూరలు, పండ్లు మొలే నవి పెస్టిసైడ్స్, కార్బైడ్స్ యొక్క విష ప్రభావాలకు గురైనవే మనకు లభిస్తున్నాయి. ఆ విషాల్ని కొంతవరకు నాశనం చేయాలంటే… గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాలు ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో కాయగూరల్ని కాని, పళ్లని కాని ఓ అరగంట నానబెట్టి, అనంతరం మంచినీటితో రెండు మూడు సార్లు కడుక్కోవాలి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%89%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81-%e0%b0%85%e0%b0%a4%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8%e0%b0%a1%e0%b0%82-%e0%b0%ae%e0%b1%81%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81/feed/ 0 4744
చుండ్రు తగ్గట్లేదా ? ఇలా చేసి చూడండి. http://www.goodinfochannels.com/%e0%b0%9a%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a4%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b0%be-%e0%b0%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%9a/ http://www.goodinfochannels.com/%e0%b0%9a%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a4%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b0%be-%e0%b0%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%9a/#respond Sat, 09 Jan 2021 13:41:52 +0000 https://teluguinfo.net/?p=185 ముఖానికి అందం తెచ్చే వాటిలో కీలకమైనది. మగవారి కంటే లేడీస్ కి జుట్టు ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎంత ఎక్కువ జుట్టు ఉంటే అంత ఎక్కువ ఆనందం ఉంటుంది. అందువల్ల జుట్టును కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

ఈ భూమిపై మనిషి పుట్టినప్పటి  నుండి  ఉన్న సమస్యల్లో ఒకటి చుండ్రు, తలలో జుట్టు నుంచీ పొడి లాంటిది రాలుతూ ఉంటుంది అది అప్పుడప్పుడూ దురద కూడా తెప్పిస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే డేంజరే ..

ఇంతకీ ఆ చుండ్రు ఎందుకొస్తుందంటే తలలో పేలు ఉండటం వల్లే. ఒక్క పేను  ఉన్నా చాలు అది జుట్టును సర్వనాశనం చేస్తుంది. ఎప్పుడో రాలిపోయే జుట్టును .. ఇప్పుడే రాలిపోయేలా చేస్తుంది. బట్టతల ఇతర సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు. మన జుట్టులోంచీ ఇతరుల జుట్బులోకి కూడా పేనులు ఈజీగా వెళ్లగలవు వాటికి చెక్ పెట్టేందుకు మనం ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వాచ్చు. ఎలాగో తెలుసుకుంది.

కర్పూరం:

తలలో పేలను తరిమి తరిమి కొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం కర్పూరం వాడకం. ఏం చెయ్యాలంటే మీరు వాడే షాంపూలో కాస్త కర్పూరం కూడా కలపండి. అలాగే మీరు వాడే కొబ్బరి నూనెలో కూడా కర్పూరు కలిపి తలకు రాసుకోండి ఏదో కొత్త పదార్ధం దొరికింది అనుకొని పేలు కర్పూరాన్ని తింటాయి. అప్పుడవి చచ్చిపోతాయి. ఎందుకంటే క్రిములనూ సూక్ష్మజీవులని  సర్వనాశనం చేయగలిగే శక్తి కర్పూరానికి ఉంది.

వేప :

ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం లో  తప్పని సరి ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే అది వేప అని చెప్పుకోవచ్చు. వేపలో  సూక్ష్మజీవులని చంపేసే యాంటి ఇన్ఫోమెటరి గుణాలు బోలెడన్ని ఉన్నాయి. వేప నునూ లేదా వేప పేస్ట్ ఏదైనా సేకరించండి. లేదా వేపాకుల్ని గుజ్జులా చేసి పిండితే రసం వస్తుందిగా దాన్ని సేకరించుకోండి. దాన్ని తలకి బాగా పట్టించండి ఓ పావు గంట అలా జుట్టును ఆరనివ్వండి. ఆ తరువాత చుండ్రుతో పాటు పేలూ పోతాయి.

ఈ భూమిపై మనిషి పుట్టినప్పటి  నుండి  ఉన్న సమస్యల్లో ఒకటి చుండ్రు, తలలో జుట్టు నుంచీ పొడి లాంటిది రాలుతూ ఉంటుంది అది అప్పుడప్పుడూ దురద కూడా తెప్పిస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే డేంజరే ..

ఇంతకీ ఆ చుండ్రు ఎందుకొస్తుందంటే తలలో పేలు ఉండటం వల్లే. ఒక్క పేను  ఉన్నా చాలు అది జుట్టును సర్వనాశనం చేస్తుంది. ఎప్పుడో రాలిపోయే జుట్టును .. ఇప్పుడే రాలిపోయేలా చేస్తుంది. బట్టతల ఇతర సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు. మన జుట్టులోంచీ ఇతరుల జుట్బులోకి కూడా పేనులు ఈజీగా వెళ్లగలవు వాటికి చెక్ పెట్టేందుకు మనం ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వాచ్చు. ఎలాగో తెలుసుకుంది.

కర్పూరం:

తలలో పేలను తరిమి తరిమి కొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం కర్పూరం వాడకం. ఏం చెయ్యాలంటే మీరు వాడే షాంపూలో కాస్త కర్పూరం కూడా కలపండి. అలాగే మీరు వాడే కొబ్బరి నూనెలో కూడా కర్పూరు కలిపి తలకు రాసుకోండి ఏదో కొత్త పదార్ధం దొరికింది అనుకొని పేలు కర్పూరాన్ని తింటాయి. అప్పుడవి చచ్చిపోతాయి. ఎందుకంటే క్రిములనూ సూక్ష్మజీవులని  సర్వనాశనం చేయగలిగే శక్తి కర్పూరానికి ఉంది.

వేప :

ప్రాచీన కాలం నుంచి ఆయుత్వేదం లో  తప్పని సరి ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే అది వేప అని చెప్పుకోవచ్చు. వేపలో  సూక్ష్మజీవులని చంపేసే యాంటి ఇన్ఫోమెటరి గుణాలు బోలెడన్ని ఉన్నాయి. వేప నునూ లేదా వేప పేస్ట్ ఏదైనా సేకరించండి. లేదా వేపాకుల్ని గుజ్జులా చేసి పిండితే రసం వస్తుందిగా దాన్ని సేకరించుకోండి. దాన్ని తలకి బాగా పట్టించండి ఓ పావు గంట అలా జుట్టును ఆరనివ్వండి. ఆ తరువాత చుండ్రుతో పాటు పేలూ పోతాయి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%9a%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a4%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b0%be-%e0%b0%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%9a/feed/ 0 4732