#how to improve my hemoglobin a1c 2021 – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Thu, 14 Jan 2021 18:16:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. http://www.goodinfochannels.com/%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%b6%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d/ http://www.goodinfochannels.com/%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%b6%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d/#respond Thu, 14 Jan 2021 18:16:09 +0000 https://teluguinfo.net/?p=198 రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి మనిషిని బలహీనంగా మారుస్తుంది.అలాగే ఐరన్(ఇనుము) లోపానికి కూడా దారితీస్తుంది. ఐరన్ లోపం అనేది తీవ్రతరం అయితే అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఈ సమస్య కారణంగా ఎర్ర రక్త కణాల సంఖ్య- లేదా వాటి ఆక్సిజన్ మోసే సామర్థ్యం శారీరక అవసరాలను తీర్చడానికి సరిపోదు.
యునిసెఫ్ నివేదిక ప్రకారం భారత్ లో 15-19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలలో 56 శాతం బాలురులో 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శరీరంలో ఇనుము స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని సాధారణ గృహ నివారణలను కూడా సూచించారు. అవేంటంటే


మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.

నల్ల నువ్వులు :
వీటిలో ఇనుము, రాగి, జింక్, సెలీనియం విటమిన్- బి6, ఇ తో పాటు ఫోలేట్లు పుష్కలంగా లభిస్తాయి.
ఎలా తినాలి :
సుమారు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు, డ్రై రోస్ట్ లను ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నెయ్యితో కలపండి. ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకుని తినండి. ఇనుము లోపం ఎక్కువగా ఉన్నవారు ఈ లడ్డూలను తప్పకుండా తీసుకోండి.

కర్జురా, ఎండుద్రాక్ష :
ఈ పొడి పండ్ల కలయిక ఇనుము, మెగ్నీషియం రాగి, విటమిన్లు- ఎ మరియు సి లను కలిగి ఉంటాయి.
ఎలా తినాలి :
2-3 కర్జూరాలు, ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షను ఉదయాన్నే అల్పాహారంగా, లేదా సాయంత్రం పూట స్నాక్ లాగా తిన్నారంటే మీరు తక్షణ శక్తిని పొందటమే కాక, ఐరన్ స్థాయిలను కూడా పెంచుకోవచ్చు.

బీట్‌రూట్లు, క్యారెట్లు :
తాజా బీట్ రూట్, కారెట్లు కలిపి చేసిన జ్యూస్ తాగడం వల్ల ఇనుము శోషణ పెరుగుతుంది. నిమ్మరసం దీనికి విటమిన్- సి కంటెంట్ను జోడిస్తుంది.
ఎలా తినాలి :
ఒక కప్పు తరిగిన బీట్ రూట్, కప్పు తరిగిన క్యారెట్లు వేసి మిక్సీ పట్టండి. ఈ రసాన్ని వడకట్టి దీంట్లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. ప్రతిరోజూ ఉదయం ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగాలి.


వీట్ గ్రాస్ :
ఇది బిటా కెరోటిన్, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ విటమిన్ సి అనేక బి విటమిన్ల అద్భుతమైన మూలాన్ని అందిస్తుంది. అంతేకాదు అనేక రకాల రక్త నిర్మాణ కారకాలను కలిగి ఉంటుంది.
ఎలా తినాలి :
ప్రతిరోజూ ఉదయం ఒక టీస్పూన్ వీట్ గ్రాస్ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడటమే కాక, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


మోరింగా ఆకులు :
మోరింగా విత్తనాలు ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఇనుము విటమిన్లు ఎ, సిలతో పాటు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
ఎలా తినాలి :
ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఉదయం 1 స్పూన్ మోరింగా ఆకు పొడి తింటే శరీరంలో ఐరన్ లెవెల్ పెరుగుతాయి.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%ae%e0%b0%a8-%e0%b0%b6%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%bf%e0%b0%ae%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%ac%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d/feed/ 0 4735