Katuka kannula song telugu download – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Sun, 24 Oct 2021 17:39:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి సాంగ్ తెలుగు లిరిక్స్|Katuka kanule song telugu lyrics http://www.goodinfochannels.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%9f%e0%b1%81%e0%b0%95-%e0%b0%95%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2%e0%b1%87-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b1%87-%e0%b0%aa/ http://www.goodinfochannels.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%9f%e0%b1%81%e0%b0%95-%e0%b0%95%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2%e0%b1%87-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b1%87-%e0%b0%aa/#respond Sun, 24 Oct 2021 17:39:22 +0000 https://teluguinfo.net/?p=384 Read More »కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి సాంగ్ తెలుగు లిరిక్స్|Katuka kanule song telugu lyrics]]> లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి
మాటలు అన్ని మరిసిపోయా నీళ్ళే నమిలేసి

ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చేరా
వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చేరా

నా కొంగు చివర దాచుకున్నా చిల్లరే నువ్వురా
రాతిరంత నిదురపోని అల్లరే నీదిరా
మొడుబారి పోయి ఉన్నా అడవిలాంటి ఆశకేమో
ఒక్కసారి చివురులొచ్చేరా

నా మనసే నీ వెనకే తిరిగినదీ
నీ మనసే నాకిమ్మని అడిగినదీ

లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

గోపురానా వాలి ఉన్నా పావురాయిలా
ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా
నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా
చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా

నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా
నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా
నే ఉగ్గబట్టి ఉంచినా అగ్గి అగ్గి మంటనీ
బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా

నీ సూదిలాంటి చూపుతో ధారమంటి నవ్వుతో
నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టరా
నా నుదిటి మీద వెచ్చగా ముద్దు బొట్టు పెట్టారా
కుట్టి కుట్టి పోరాఆ ఆ కందిరీగ లాగా
చుట్టు చుట్టుకోరా ఆ ఆ కొండచిలువ లాగా

కత్తి దుయ్యకుండ సోకు తెంచినావురా
గోరు తగలకుండ నడుము గిచ్చినావురా
అయ్యబాబోయ్ అస్సలేమి ఎరగనట్టుగా
రెచ్చగొట్టి తప్పుకుంటావెంత తెలివిగా

నీ పక్కనుంటే చాలురా పులస చేప పులుసులా
వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా
నే వేడి వేడి విస్తరై తీర్చుతాను ఆకలి
మూడు పూట్ల ఆరగించరయ్య
నా చేతి వేళ్ళ మెటికలు విరుచుకోర మెల్లిగా
చీరకున్నా మడతలే చక్కబెట్టారా

నీ పిచ్చి పట్టుకుందిరా వదిలిపెట్టనందిరా
నిన్ను గుచ్చుకుంటా ఆ ఆ నల్లపూసలాగా
అంటిపెట్టుకుంటా ఆ ఆ వెన్నుపూసలాగా

లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ
లల్లాయి లాయిరే లాయిరే లాయ్
లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%9f%e0%b1%81%e0%b0%95-%e0%b0%95%e0%b0%a8%e0%b1%81%e0%b0%b2%e0%b1%87-%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b1%87-%e0%b0%aa/feed/ 0 384