papilon – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Tue, 18 May 2021 18:09:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 తెలంగాణ పోలీసులు నిమిషాల్లో నేరస్తులను పసిగట్టేస్తున్నారు! http://www.goodinfochannels.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2/ http://www.goodinfochannels.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2/#respond Tue, 18 May 2021 18:09:42 +0000 https://teluguinfo.net/?p=266 ఎంతటి మహా నేరస్థులైనా ఏదో ఒక చోట తప్పుచేస్తారు. వేలిముద్రలతో చిన్న క్లూ ఇచ్చేస్తారు. ఇలా వచ్చిన ఒక్క ‘ చాన్స్’తో తెలంగాణ పోలీసులు నిమిషాల్లో నేరస్థులను పసిగట్టేస్తున్నారు. వెంటాడి పట్టేస్తున్నారు. నేర పరిశోధనలో తమదైన ‘ముద్ర’ వేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్న సాంకేతికత పాపిలాన్ను ఉపయోగించి వేలిముద్ర (చాన్స్ ప్రింట్)తో కరుడుగట్టిన నేరస్థులనూ కటకటాల్లోకి పంపుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పదుల సంఖ్యలో కేసులను పరిష్కరించారు. నేరం చేసినా దొరికిపోతాం’ అనుకునేలా దొంగలకు గుబులు పుట్టిస్తు న్నారు. నేరస్థులు ఎవరైనా వేలిముద్ర (చాన్స్ ప్రింట్)తో పట్టేస్తున్నారు తెలంగాణ ఫింగర్ ప్రింట్ పోలీసులు. అత్యాధునిక పాపిలాన్ సాంకేతికతతో నేరస్థులను నీడలా వెంటాడుతున్నారు. నేరం జరిగిన వెంటనే పట్టుకుని కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కేసుల ఛేదనలోనూ సాయం అందిస్తున్నారు.

నేరస్థులను పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు తమదైన ముద్ర వేస్తున్నారు. నేర పరిశోధనలో దేశంలోనే తొలిసారిగా సాంకేతికత పాపిలానను జోడించారు. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. సీఐడీలోని తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఆధ్వర్యంలో తీసుకొచ్చిన మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ లు, లైవ్ స్కానర్లు, ఇంటర్ స్టేట్ డాటా షేరింగ్.. చేపట్టిన ఎన్నో సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లిలో ఇటీవల పెండ్లింట 61 తులాల బంగారం, రూ.2.80 లక్షల సొమ్ము చోరీ సంచలనం సృష్టించింది. నిందితుడు వదిలిన ఏకైక ఆధారం వేలి ముద్ర (చాన్స్ ప్రింట్). దాని ఆధారంగా నిందితుడు రాజేంద్రప్రసాద్ జాడను పోలీసులు కనిపెట్టారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీల్లో రూ. 12.45 లక్షల సొత్తు ఎత్తుకెళ్లిన పాండును వేలిముద్రల ఆధారంగానే పోలీసులు అరెస్టుచేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన షేక్ ఉస్మాన్ మంచిర్యాలలో చోరీ సొత్తు అమ్మేందుకు తిరుగుతుండగా మొబైల్ ఫింగర్ ఫ్రింట్ డివైజ్ ద్వారా పరిశీలించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాపిలాన్ అంటే..
పాపిలాన్ అనేది ఒక సాఫ్ట్ వేర్, ఫింగర్ ప్రింట్ పరిశోధనకు సంబంధించి దీన్ని వాడుతున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో పాత నేరస్థుల వేలిముద్రలతో తయారుచేస్తారు. నేరస్థలిలో లభించే వేలిముద్రలను ఈ టెక్నాలజీని ఉపయోగించిన డాటాబేస్లోని నేరస్థుల ఫింగర్ ప్రింట్స్ తో పోల్చి క్షణాల్లోనే నిందితులను గుర్తిస్తున్నారు. తక్కువ సమయంలోనే నేరస్థులను అరెస్టుచేసే అవకాశం కలుగుతున్నది. అంతర్జాతీయస్థాయి దర్యాప్తు సంస్థలు సైతం ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. దేశంలో తెలంగాణలోనే దీని వినియోగం మొదలైంది.
సాంకేతికతతో మంచి ఫలితాలు
అత్యాధునిక పాపిలాన్ టెక్నాలజీ వినియోగంతో రాష్ట్రంలో చాలా కేసులు త్వరితగతిన ఛేదించగల్గుతున్నాం. క్షేత్రస్థాయి సిబ్బందికి ఇచ్చిన మొబైల్ చెక్ డివైజ్ లతో అనుమానితులను రియల్ టైంలో గుర్తించ గల్గుతున్నాం. నేరాల కట్టడికి వీలు కలుగుతున్నది. చాలావరకు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలకు చెక్ పెట్టగల్గుతున్నాం. సాంకేతిక విధానంలో డాటాను నిక్షిప్తం చేస్తుండటంతో భవిష్యత్తులోనూ
ఉపయోగపడుతుంది.

]]>
http://www.goodinfochannels.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2/feed/ 0 4749