sitta sittenda kotte folk song – Good Info Channel http://www.goodinfochannels.com My WordPress Blog Fri, 18 Nov 2022 14:03:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 230968877 “Sitta Sittenda Kotte” Song Lyrics Telugu http://www.goodinfochannels.com/sitta-sittenda-kotte-song-lyrics-telugu/ http://www.goodinfochannels.com/sitta-sittenda-kotte-song-lyrics-telugu/#respond Fri, 18 Nov 2022 14:03:27 +0000 https://teluguinfo.net/?p=3144 Read More »“Sitta Sittenda Kotte” Song Lyrics Telugu]]> Sitta Sittenda Kotte song lyrics పాట నేపథ్యం: *కొత్తగా పెళ్ళైన అమ్మాయి మనసు.. కొద్దిరోజులు అదోలా ఉంటుంది. తన తలిదండ్రుల మీదికి, ఊరు మీదికి పాణం కొట్టుకుంటుంది. *అందుకే.. ఆ ఇల్లాలు.. ఎంతో బాధతో.. ఇంటి పందిరిగుంజ.. ఇంట్లో మొగురం లకు.. ఒరిగిపోయి.. ఉంటుంది. *భర్త వచ్చి పలకరించిన కూడా.. చలించదు. దీర్ఘాలోచనలో ఉంటుంది. *ఇక లాభం లేదనుకొని.. భర్తనే.. అమ్మాయి బాధ నుండి విముక్తి చేయాలని.. ఆలోచించి… తనయొక్క తలిదండ్రులు… చెల్లెలు, అన్నావదినెలతో.. ఎలా ఉండాలో చెబుతాడు. ఏం చేస్తే… వారి మనసు దోసుకోవచ్చో ఎరుకజేస్తాడు. *చివరకు.. అసలు సంసార సాగరాన్ని ఎలా ఈదాలో చెబుతాడు. *జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎలా ఎదుర్కోవాలో.. పూసగుచ్చినట్టు.. రాగయుక్తంగా.. .మన సంస్కృతి, సంప్రదాయాలకు తగినట్టుగా.. వివరిస్తాడు. *ఇల్లాలు మొఖంలో చిరుమందహసం రావడంతో.. పాట.. సుఖాంతం అవుతుంది😊👍💖💖

“Sitta Sittenda Kotte” Song Info

రచన & దర్శకత్వంపరశురాం నాగం.
గానంబొడ్డు దిలీప్ కుమార్
సంగీతంప్రవీణ్ కాయితోజు
Tune Sourceనరావుల మల్లవ్వ,
DOP& ఎడిటింగ్, DIశివ కుమార్ అల్లే,
ప్రధాన తారాగణంపరశురాం కంబల్ల & రాజేశ్వరి

“Sitta Sittenda Kotte” Song Lyrics

Sitta Sittenda Kotte song lyrics

సిట్ట సిట్టెండా గొట్టే.. సెట్టిగురు వెట్టే ….
చంద్రుని కన్నెంతనో…..
చంద్రుని కన్నెంతనో చెలియా మీదుండే…

రాగాలు దీసేటి గువ్వా.. రంగులా సీలుకా..
వలపోతా నీకేలానో…
వలపోతా నీకేలానో…వలదే నా సీలుకా..
వలపోతా నీకేలానో…వలదే దీము ఉన్నా..

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
ఇల్లు జూడవే.. ఇంటి ఇలవేల్పు జూడు..
ఇండ్లల్ల గొలిసేటీనో..
ఇండ్లల్ల గొలిసేటీనో.. మల్లన్న జూడు
ఇండ్లల్ల కొలిసిటీనో.. మల్లన్న మొక్కూ..

ఎడ్లు జూడవే.. ఎడ్ల బండ్లను జూడు
ఎములాడా కోయేటినో..
ఎములాడాకోయేటినో.. బండ్లను జూడు..
జాతరవోయేటినో బండ్లను జూడు..

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
అలుకు జల్లవే అలికి.. ముగ్గులూ వెట్టూ
అలుకు జల్లవే అలికి.. ముగ్గులే వెడితే..
అత్తమ్మ మనసెంతానో..
అత్తమ్మ మనసెంతానో.. నీమీదనుండే..

నీళ్లు జేదవే సేది.. సేతికందియ్యు
నీళ్లు జేదవే సేది.. సేతికందిదిత్తే..
మామయ్యా భమలెంతానో
మామయ్య భమలెంతానో… నీ మీదుండే.

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
తొవ్వ నడువవే దూగి.. మునుములు గలువు
అంతులూ వేట్టేటీనో..
అంతులూ వెట్టేటీనో ఆరండ్ల జూడు..
ఆరండ్ల పోటెంతానో నీ మీదుండే..

ఆడిబిడ్డ శోకం వలదు.. అలుకలు వలదు
మా ఇంటి మా లచ్చిమీ..
మా ఇంటి మా లచ్చిమీ.. మరువకే సిలుకా..

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
ఎలుగటి నాగండ్లు గట్టీ.. రాగాళ్లు దుంతే..
సాల్లల్లా సాగేటినో…
సాల్లల్లా సాగేటినో… నడకలు జూడు..
సాల్లల్లా మొలిసేటినో.. మొలకల జూడు..

పొద్దున్న లేసి పోలము.. బాటలూ వడితి..
పొద్దున్న లేసి పోలము.. బాటలే వడితే…
సద్దూలు దెచ్చేటినో….
సద్దూలు దెచ్చెటినో.. అన్నపూర్ణావే..

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

నువ్వేమో నాకూ తోడూ నేను నీ నీడా..
ఏడేడు జన్మాలు కూడి అడుగులేయంగా..
గుండెల్లో కొలువయ్యినావో..
గుండెల్లో కొలువయ్యినావో..నా గూటి సిలుకా..

సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే ..
చంద్రుని కన్నెంతనో…..
చంద్రుని కన్నెంతనో చెలియా మీదుండే

“Sitta Sittenda Kotte” Song Video

రచన & దర్శకత్వం : పరశురాం నాగం. గానం : బొడ్డు దిలీప్ కుమార్ సంగీతం : ప్రవీణ్ కాయితోజు Tune Source : నరావుల మల్లవ్వ, DOP& ఎడిటింగ్, DI : శివ కుమార్ అల్లే, ప్రధాన తారాగణం : పరశురాం కంబల్ల & రాజేశ్వరి

]]>
http://www.goodinfochannels.com/sitta-sittenda-kotte-song-lyrics-telugu/feed/ 0 3144